అన్వేషించండి

Pithapuram Crime News : రెండో పెళ్లికి అడ్డుగా ఉందని పసికందును చంపిన అమ్మ అమ్మమ్మ, కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచ‌ల‌నం

Pithapuram Crime News : కాకినాడజిల్లా పిఠాపురం జ‌గ్గ‌య్య‌చెరువులో ఈనెల 7న ఓ ప‌సికందు ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న బావిలో శ‌వ‌మై తేలింది. క్షుద్ర‌పూజ‌ల‌కోస‌మే ప‌సికందును క‌డ‌తేర్చార‌ని అంతా భావించారు. కానీ..

Pithapuram Crime News : ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌తో కొంత‌కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్న ఆమె మ‌రో పెళ్లికి సిద్ధమైంది. అయితే అప్ప‌టికే త‌న‌కు పుట్ట‌ని ఆడ‌పిల్ల అయిదు నెల‌ల ప‌సికందుగా త‌న ఒళ్లో అడుకుండ‌టం స‌హించ‌లేని ఆమె అమ్మ‌త‌నానికి మాయ‌ని మ‌చ్చ‌గా చేసి త‌న చేతుల‌తో చంపి బావిలో ప‌డేసింది. ఈదుర్మార్గ‌పు స‌ల‌హాను ఆమె క‌న్నత‌ల్లి అంటే ప‌సికందు అమ్మ‌మ్మ ఇవ్వ‌డం.. ఆపై క్షుద్ర‌పూజ‌ల కోసం ఎవ‌రో బిడ్డ‌ను ఎత్తుకెళ్లి బావిలో ప‌డేశార‌ని న‌మ్మించాల‌ని చూశారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో ద‌ర్యాప్తు చేసి అమ్మ‌, అమ్మ‌మ్మ నిందితులను నిర్దారించారు. చివ‌ర‌కు జైలుకు పంపారు. ఈ దారుణ ఘ‌ట‌న కాకినాడ జిల్లా పిఠాపురం జ‌గ్గ‌య్య చెరువులో చోటుచేసుకుంది.. 

కాకినాడ జిల్లా పిఠాపురం జ‌గ్గ‌య్య‌చెరువులో ఈనెల 7వ తేదీన ఓ ప‌సికందు ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న బావిలో శ‌వ‌మై తేలింది. అదే స‌మ‌యంలో ఆ ఇంటి ముందు ప‌సుపు, కుంకుమ‌, నిమ్మ‌కాయ‌లు వేసి క్షుద్ర‌పూజ‌లు జ‌రిపి, ప‌సికందును బ‌లి ఇచ్చిన‌ట్లుగా కనిపించింది. సంచ‌ల‌నం రేకెత్తించిన ఈ కేసును పిఠాపురం పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది 5 నెల‌ల ఆడ ప‌సికందును హ‌త్య చేసింది క‌న్న‌త‌ల్లేన‌ని, సూత్ర‌ధారి, పాత్ర‌దారి ఆ ప‌సికందు అమ్మ‌మ్మేన‌ని తేల్చారు పోలీసులు. 

కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచ‌ల‌నం రేపిన ప‌సికందు హ‌త్య కేసు మిస్ట‌రీ గుట్టును పోలీసులు విప్పారు. క‌న్న‌త‌ల్లే హత్యలో కీల‌క‌పాత్ర పోషించ‌డంతో స్థానికులు విస్తుపోయారు. త‌న జీవితం బాగుండాలంటే అడ్డుగా ఉన్న ఆడ‌పిల్ల‌ను త‌ప్పించాల‌నే దుర్మార్గ‌పు ఆలోచ‌న ఒక‌రిదైతే.. ప‌సికందును మాయం చేసే ఉపాయం చెప్పిన ప‌సికందు అమ్మ‌మ్మ కుట్ర కోణం ఈ కేసులో వెలుగుచూసింది. ఆ పాప‌ హ‌త్య‌కు క్షుద్ర‌పూజ‌లు అనే ప్లాన్‌లు అమ‌లుప‌ర‌చినా పోలీసుల ముందు వారి ఆట‌లు సాగ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఆధారాల‌తో చిక్క‌డంతో క‌ట‌క‌టాలు పాల‌య్యారు.

ప‌సికందు హ‌త్య‌కు అస‌లు కార‌ణ‌మిదే..!

పిఠాపురం జ‌గ్గ‌య్య‌చెరువులో శైల‌జ‌, స‌తీష్ అనే ఇద్ద‌రు ప్రేమికులు ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తున్నారు. వీరికి 5 నెల‌ల ప‌సికందు ఉంది. పాప‌కు య‌శ్వంతిని అనే పేరు కూడా పెట్టారు. అయితే కొంత కాలంగా స‌తీష్, శైల‌జ మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. స‌తీష్‌తో వేగ‌లేనంటూ శైల‌జ మ‌రో వివాహానికి సిద్ధ‌ప‌డింది. అడ్డుగా ఆడ‌పిల్ల ఉండ‌టంతో ఏం చేయాలో తెలియలేదు. శైల‌జ త‌ల్లి అన్న‌వ‌రం కూడా ప‌సికందును వ‌దిలించుకుంటే మంచిద‌ని కూతురికి త‌ప్ప‌డు స‌ల‌హా ఇచ్చింది. దీంతో ఇద్ద‌రు పక్కా ప్ర‌ణాళిక‌తో ప‌సికందును చంపి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న బావిలో ప‌డేశారు. త‌మ పాప‌ని ఎవ‌రో చంపిన‌ట్లుగా చుట్టుప‌క్క‌ల వారిని న‌మ్మించ‌డానికి క్షుద్ర‌పూజ‌లు జ‌రిగిన‌ట్టు నాట‌కం ఆడారు. 

ఇంటి ముందు ప‌సుపు, కుంకుమ‌, నిమ్మ‌కాయలు ఉంచి, త‌మ పాప‌ను క్షుద్ర‌పూజ‌ల‌తో చంపార‌ని క‌ల‌రింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి త‌క్కువ స‌మ‌యంలో కేసును నిగ్గు తేల్చారు. పసిపాప త‌ల్లి శైల‌జ‌, ఆమె త‌ల్లి అన్న‌వ‌రం నిందితులుగా గుర్తించి జైలుకి పంపారు.

లోతైన ద‌ర్యాప్తుతో అస‌లు నిజం బ‌ట్ట‌బ‌య‌లు.. 

పిఠాపురంలో స్థానికంగా సంచ‌ల‌నం రేకెత్తించిన ఈ ఘ‌ట‌న‌లో వాస్త‌వాలు తెలుసుకున్న స్థానికులు విస్మ‌యానికి గురైన ప‌రిస్థ‌తి క‌నిపించింది.. ప‌సికందు శ‌వ‌మై బావిలో తేల‌డంతోపాటు అక్క‌డే క్షుద్ర పూజ‌లు చూసిన‌ట్లు క‌నిపించ‌డంతో పోలీసులు ప‌లు కోణాల్లో విచార‌ణ చేప‌ట్టారు. క్లూస్ టీంను సైతం రంగంలోకి దింపారు. దీంతో ఈకేసులో ప్ర‌దాన నిందితులు ప‌సికందు త‌ల్లి శైల‌జ‌, అమ్మ‌మ్మ అన్న‌వ‌రంగా గుర్తించారు. వీరిని త‌మ‌దైన శైలిలో విచారించిన పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. కేసును త‌క్కువ స‌మ‌యంలో ఛేదించిన క్రైమ్ పోలీసుల‌ను ఎస్పీ బిందుమాధ‌వ్‌, అడిష‌న‌ల్ ఎస్పీ దేవ‌రాజ్ మ‌నీష్ పాటిల్‌ల‌తోపాటు ఉన్న‌తాధికారులు అభినందించారు. నిందితుల‌ను కోర్టుకు హాజ‌రుప‌రిచగా రిమాండ్ విధించిన‌ట్లు పిఠాపురం సిఐ జి.శ్రీనివాస్‌, ఎస్సై మ‌ణికుమార్‌లు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Embed widget