Rains in AP Telangana: రెయిన్ అలర్ట్ - నేడు ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా
Rains in Telangana AP: ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని, ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.
Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని, ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. వర్షం కురిసే ప్రాంతాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కామారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కొమురంభీమ్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసింది. నేడు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్ష సూచన ఉంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 1, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తాజాగా ఏర్పడుతున్న మార్పుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో చాలా తక్కువే. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. మిగతా చోట్ల అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి..
District wise weather forecast for Andhra Pradesh Dated 01.09.2022. pic.twitter.com/A0wV0yK74e
— MC Amaravati (@AmaravatiMc) September 1, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో నేడు వర్ష సూచన అంతంతమాత్రమే. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. దక్షిణ కోస్తాంధ్రలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మాత్రం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు.