అన్వేషించండి

Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక.
  • నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా, ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదు.
  • ఏపీలో రుతుపవన విస్తరణతో పిడుగులతో కూడిన భారీ వర్ష హెచ్చరిక.
  • ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు.

హైదరాబాద్: తెలంగాణలో రాగల రెండు రోజుల వాతావరణానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, రాబోయే రెండు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయని తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకావం ఉందని అంచనా వేశారు.

మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గురువారం  మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 42.2 నుండి 42.8 డిగ్రీల మధ్య, మరో నాలుగు జిల్లాల్లో 41 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.

Also Read: Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించాయి. రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాత్రికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన  వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. విజయవాడలో గురువారం కురిసన భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు.

అలాగే, శుక్రవారం నాడు పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిల్చోరాదు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.

Frequently Asked Questions

తెలంగాణలో రాబోయే రెండు రోజులకు వాతావరణ అంచనా ఏమిటి?

శుక్రవారం, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి.

తెలంగాణలో వడగాలుల హెచ్చరిక ఉన్న జిల్లాలు ఏవి?

ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలకు వర్షాలు, పిడుగుల హెచ్చరిక జారీ చేయబడింది?

కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, వైర్లు, పెద్ద హోర్డింగ్స్ కింద నిల్చోరాదు. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget