IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Loksabha Mithun Vs Raghurama : లోక్‌సభలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ.. మిథున్ రెడ్డి , రఘురామకృష్ణరాజు పరస్పర సవాళ్లు !

లోక్‌సభ జీరో అవర్‌లో ఏపీలో శాంతిభద్రతలు లేవని ప్రసంగిస్తున్న రఘురామను ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. సీబీఐ కేసులపై ఇరువురూ విమర్శలు చేసుకున్నారు.

FOLLOW US: 

లోక్‌సభ జీవో అవర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. జీరో అవర్‌లో రఘురామకృష్ణరాజు అమరావతి రైతుల పాదయాత్రకు ఏర్పడుతున్న అడ్డంకులపై ప్రసంగించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని రఘురామ లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని  తీవ్రంగా హింసిస్తున్నారని అన్నారు.  శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా క్షీణించాయి కాబట్టి లో్‌సభలో చెప్పక తప్పడం లేదన్నారు.  ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ఆరోపించారు. 

Also Read : పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించండి... మంచి ఆదాయం వచ్చే విధానాలు సూచించండి... వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష

రఘురామ ప్రసంగిస్తున్న సమయంలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు అడ్డు తగిలారు. రఘురామరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మిధన్ రెడ్డి రఘురామకృష్ణరాజుపై మండిపడ్డారు. సభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదని.. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తున్నారని మిథున్ రెడ్డి ఖండించారు. రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశారని... వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: కొడికొండ - మేదరమెట్ల హైవేకి గ్రీన్ సిగ్నల్.. పాత ప్రాజెక్టు ప్లాన్ కనుమరుగే..

రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెల్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్‌ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇండ్ భారత్‌ థర్మల్‌ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని మిథున్ రెడ్డి కోరారు. 

Also Read : ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు.. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు !
 
మిథున్ రెడ్డికి రఘురామకృష్ణరాజు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. తనపై రెండే సీబీఐ కేసులు ఉన్నాయని మీ నాయకుడిపై వంద కేసులున్నాయని వాటి సంగతి ముందు తేల్చాలన్నారు. ఇద్దరూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలే కావడం.. ఇరువులు ఒకరిపై ఒకరు తమపై ఉన్న కేసులను తేల్చాలని డిమాండ్ చేయడం లోక్‌సభలో ఉన్న ఎంపీలకు ఆసక్తి కలిగించింది. 

Also Read : ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Dec 2021 03:52 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Lok Sabha Cbi cases ysrcp mps Raghuram Krishnaraju Mithun Reddy

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ ముఠా, మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు 

Breaking News Live Updates : రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ ముఠా, మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు 

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే !  చంద్రబాబు చక్కదిద్దగలరా ?

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య

Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

YSRCP Politics :  సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ -  వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!