Chandra Babu : ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు.. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు !
ఓటీఎస్ పథకం పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు ఆపేస్తామని బెదిరించి పేదలను పీడిస్తున్నారని మండిపడ్డారు.
వన్‌టైం సెటిల్మెంట్, సంపూర్ణ గృహ హక్కు పథకం స్వచ్చందం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా ఉత్తదేనని.. పేదల మెడపై కత్తి పెట్టి డబ్బులు కట్టించుకుంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో ప్రజల్ని మోసం పేదల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా అని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాలలో అధికారులు లబ్దిదారుల్ని బెదిరిస్తున్న వీడియోలు .. పేదల ఆవేదనలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
Also Read : ఏపీలో సంచలనంగా మారిన TRS నేత మల్లాది వాసు ఫ్లెక్సీలు.. దీని వెనుక కథేంటి?
మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటైందని.. ఓటీఎస్ పథకాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తప్పుడు కేసులు పెడితే ప్రజలు భయపడతారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల మీదున్న రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే జగన్ చెప్పిన వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు పక్కా ఇళ్ల పధకం వచ్చిందని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఒక్కరికి ఇల్లు.. స్థలం ఇవ్వలేదని అలాంటప్పుడు డబ్బులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు.
Also Read : వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
ప్రభుత్వం చేస్తామని చెబుతున్న రిజిస్ట్రేషన్లు కూడా ఫేక్ అని చంద్రబాబు మండిపడ్డారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా ఇల్లీగల్ అని.. రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లే చేయాలన్నారు. ఎవరు పడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అవి చెల్లవన్నారు. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ డాక్యుమెంట్లను వైసీపీ రంగుల్లో ఇస్తున్నారవి.. అవి వ్యాలిడ్ కావని స్పష్టం చేశారు. పేద ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆనాడు నిర్ణయించామన్నారు. రాజధానిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. అలాంటి ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాజధానిలో అంబేద్కర్ స్మారక ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశానికే ఆదర్శమైన నిర్ణయాన్ని తాము తీసుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
Also Read: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... 200 మీటర్ల మేర కోతకు గురైన బీచ్... పర్యాటకులకు నో ఎంట్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి