X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

RRR Vs YSRCP : నవరత్నాలు ..నవరంధ్రాలుగా మారుతున్నాయంటున్న రఘురామ !

పథకాలను లబ్దిదారులను విచిత్రమైన కారణాలతో తగ్గించడం వల్ల నవరత్నాలు నవరంధ్రాలుగా మారిపోతున్నాయని రఘురామకృష్ణరాజు విమర్శించారు.

FOLLOW US: 

నవరత్నాల పథకాలన్నీ నవ రంధ్రాలుగా మారుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పెన్షన్లను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మమండిపడ్డారు. సామాజిక పెన్షన్లను తగ్గించిన అంశంపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. విద్యుత్‌ బిల్లులు రూ.300 దాటితే డయాలసిస్‌ రోగులకు పింఛన్లలో కోత విధించారని.. ఎలా చేయడం మంచిది కాదన్నారు. కరెంటు యూనిట్లకు  కిడ్నీ వైద్యానికి సంబంధం ఏముందని..కిడ్నీ రోగులను నాలుగు కాలాల పాటు బతకనివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. Also Read : కోర్టుల్లో పోర్టుల అమ్మకం డీల్స్ ! అదానీకి చిక్కులు తప్పవా ?

అలాగే గ్రామ వాలంటీర్ల తల్లిదండ్రులకు పింఛన్లు ఉంటే వాటిని కూడా రద్దు చేశారని  సేవకులని మనమే అంటున్నామని.. అలాంటి సేవకుల కుటుంబాలను షేవ్ చేయకూడదని సెటైర్ వేశారు. వాలంటీర్లలో 90 శాతం మన పార్టీ వాళ్లేనని విజయసాయిరెడ్డి చెప్పిన విషయాన్ని  జగన్‌కు గుర్తు చేశారు రఘురామకృష్ణరాజు. పెన్షన్లలో ఏదో విధంగా కోత పెట్టాలన్న ఆలోచన మారుకోవాలని సూచించారు. పథకాలన్నింటిలోనూ ఇలాగే ుందని నవరత్నాలన్నీ త్వరలోనే.. నవ రంధ్రాలవుతాయని జోస్యం చెప్పారు. ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. నిన్న బుచ్చయ్య - నేడు జేసీ ప్రభాకర్ ! టీడీపీలో సీనియర్ల రెబలిజం వెనుక కారణం ఆ అసంతృప్తేనా..!?

ఆటో డైవర్స్‌కు వాహన మిత్ర కింద రూ. పదివేలు ఇస్తున్నారు కానీ చమురు ధరలపై  టాక్స్‌లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదని ఈ కారణంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చవుతున్నాయన్నారు. ప్రభుత్వం సినిమా టిక్కెట్లు, మటన్ మార్టులు ఏర్పాటు చేయాలనే నిర్ణయంపైనా విమర్శలు గుప్పించారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వం పని కాదన్న ఉద్దేశంతో కేంద్రం వరుసగా వ్యాపార సంస్థలను అమ్మేస్తోందని గుర్తు చేసిన ఆయన అందుకు భిన్నంగా ఏపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు ఉన్న ది పరిపాలన చేయడానికే కానీ.. వ్యాపారాలు చేయడానికి కాదన్నారు. Also Read : బడుల్లో భయం..భయం ! విద్యార్థుల్లో పెరుగుతున్న కేసులలతో ఏపీ తల్లిదండ్రుల్లో ఆందోళన..!

వినాయక చవితి ఉత్సవాలలో ఏపీ గవర్నర్ పాల్గొనకపోవడంపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారని.. ఉత్సవాలలో తెలంగాణ గవర్నర్ సైతం పాల్గొన్నారని గుర్తుచేశారు. ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. వినాయక చవితి వేడుకల్లో పూజలు చేయడానికి ఐదుగురికే పర్మిషన్ ఇచ్చారని చర్చిల్లో ఆదివారం ప్రార్థనలకు కూడా ఐదుగురికే చాన్సిస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఆలయాల . ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్‌వో లైసెన్స్‌ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేసినట్లుగా లేఖను విడుదల చేశారు.

Also Read : వైఎస్ వివేకాను హత్య చేసింది వాళ్లిద్దరే ! సీబీఐ రిపోర్టులో కీలక అంశాలు ఇవే !

Tags: RRR YSRCP jagan Anhdra Raghurama

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: టీఆర్ఎస్ పాలనపై కేంద్రం సైతం ప్రశంసలు కురిపిస్తోంది.. కేటీఆర్

Breaking News Live Updates: టీఆర్ఎస్ పాలనపై కేంద్రం సైతం ప్రశంసలు కురిపిస్తోంది.. కేటీఆర్

Kakinada Mayor: కాకినాడ మేయర్ గా సుంకర ప్రసన్న ఎన్నిక.... వైసీపీ కండువాలతో హాజరైన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు

Kakinada Mayor: కాకినాడ మేయర్ గా సుంకర ప్రసన్న ఎన్నిక.... వైసీపీ కండువాలతో హాజరైన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు

Chandra Babu: ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు

Chandra Babu: ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు

APSRTC: ఆర్టీసీలో ఇకపై డొక్కు బస్సులే ఉండవు.. పనులు ఊపందుకున్నాయి

APSRTC: ఆర్టీసీలో ఇకపై డొక్కు బస్సులే ఉండవు.. పనులు ఊపందుకున్నాయి

Elections: నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోలాహలం.. ఇక ప్రచారంలోకి పార్టీలు!

Elections: నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోలాహలం.. ఇక ప్రచారంలోకి పార్టీలు!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Disha Case :   ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!