By: ABP Desam, Satyaprasad Bandaru | Updated at : 22 Apr 2023 09:30 PM (IST)
చంద్రబాబు
Chandrababu Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే చంద్రబాబు శుక్రవారం యర్రగొండపాలెంలో నిర్వహించిన సభపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతిలేని ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారని డీఎస్పీ దాన కిషోర్ కేసు నమోదు చేశారు. చంద్రబాబు పర్యటనలో రాళ్ల వాగు వద్ద బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంటే.. అప్పటికే చీకటిపడుతుండడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసగించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని, అనుమతి తీసుకోకుండా సభ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
రాళ్లదాడిపై పోలీసులకు ఫిర్యాదు
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్ కేటగిరి ఉన్న చంద్రబాబుకు కూడా భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదిమూలపు పోలీసులు కుమ్మక్కై ఈ దాడికి సహకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. వైసీపీ నేతల రాళ్లదాడిలో ఎన్‌ఎస్‌జీ సిబ్బందికి గాయాలైన విషయాన్ని ఫిర్యాదులో తెలిపారు.
రాళ్లదాడిపై టీడీపీ సీరియస్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన ఘటనలపై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్‌గా చూస్తోంది. ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ... ఫిర్యాదు చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గవర్నర్‌తోపాటు ఇతరులకు ఫిర్యాదు చేయాలని దీనిపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై 151 సీఆర్‌పీసీని ఉపయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని టీడీపీ నేతలంటున్నారు. ప్రతిపక్ష నేతను అణచివేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని.. వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను కోరాలని నిర్ణియంచుకున్నారు.
మంత్రి ఆదిమూలపు ఆధ్వర్యంలోనే దాడి
మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే స్వయంగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి టీడీపీ అధినేతపైకి ఉసిగొల్పారని విమర్శిస్తున్నారు. ఈ దాడిలో కార్యకర్తలతోపాటు, చంద్రబాబు భద్రతా సిబ్బందికి కూడా గాయాలు అయినట్టు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా వివరాలు పంపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేరుగా నాయకులు కూడా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అదే టైంలో కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ ఘటనతోపాటు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులన్నింటినీ ప్రస్తావించనబోతున్నట్టు సమాచారం. గతంలో కూడా చాలా సార్లు చంద్రబాబుపై దాడికి యత్నించారని గుర్తు చేస్తున్నారు నాయకులు. వాటన్నింటినీ ఈ ఫిర్యాదులో పొందుపరిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అధినేతతోపాటు సామాన్యులపై కూడా జరుగుతున్న దాడులను వివరించనున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖకు కూడా ఎన్‌ఎస్జీ నివేదిక పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!