అన్వేషించండి

Punganur Politics : పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్ - ఆపలేకపోతున్న పెద్దిరెడ్డి

TDP : పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలో చేరిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ సహా పన్నెండు మంది కౌన్సిలర్లు టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు నేతృత్వంలో టీడీపీలో చేరిపోయారు.


Peddireddy followers are joining TDP in Punganur  : వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన పుంగనూరులో చాలా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పుంగనూరు వైసీపీ కార్యకర్తలు, నేతలు టీడీపీలో చేరిపోతున్నారు. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన  పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్‍బాషాతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.  పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు.  మొత్తం 31 మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో 25 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.              

పుంగనూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని  కంచుకోటగా మార్చుకున్నారు. ప్రత్యర్థి నేత ఎవరైనా సరే దాడులకు గురవ్వాల్సిందే. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన అనీషా రెడ్డి వేధింపులను భరించలేక కన్నీరు పెట్టుకుని రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చల్లా రామచంద్రారెడ్డి ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకుని టీడీపీ కోసం పని చేశారు. ఆయన ఎన్నో సార్లు దాడులకు గురయ్యారు. అలాగే భారత చైతన్య యువజన పార్టీ పెట్టుకున్న మరో నేత బోడె రామచంద్రయాదవ్ పైనా అనేక సార్లు దాడులు జరిగాయి. ఇక చంద్రబాబుపై అంగళ్లు వద్ద రాళ్ల దాడి జరిగిన తర్వాత పుంగనూరులోకి వచ్చే క్రమంలో ఆయనపై మరోసారి దాడి చేశారు. ఇలాంటి దాడులతో పుంగనూరులో మరొకరు అడుగు పెట్టుకుండా చూసుకునేవారన్న విమర్శలు ఉన్నాయి.                 

అయితే ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. విషంయ తెలిసి టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు పుంగనూరులో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన టూర్ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేకపోయారు. మరో వైపు ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న  వారు పార్టీ మారిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠం .... టీడీపీ ఖాతాలోకి  వెళ్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.                    

తాను, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందరిపై దాడులు చేయడం.. పుంగనూరులోకి రాకుండా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు అదే చేస్తున్నారు. టీడీపీ నేతలపై గత ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కవని.. అన్నింటికి లెక్క తీస్తామని అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా వైసీపీ క్యాడర్ ను కాపాడలేని స్థితిలో  ఉండటంతో ఎక్కువ మంది పార్టీ మారిపోతున్నారు.              

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget