Mahanadu: మహానాడు అంటే గుర్తుకు వచ్చేది టీడీపీనే - మిత్రపక్షానికి శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్
Janasena: మహానాడు అంటే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని పవన్ అన్నారు. మహానాడు జరుపుకుంటున్న టీడీపీకి పవన్ శుభాకాంక్షలు చెప్పారు.

Pawan wishes TDP on Mahanadu : మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు , నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
*మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక*
— Pawan Kalyan (@PawanKalyan) May 27, 2025
మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా…
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో సభ నిర్వహించినప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనుచరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలా పేర్కొన్నారు: “జనసేన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉంది, రాష్ట్రంలో పురోగతి మరియు సంపదను నడిపిస్తున్న దాని పాత్ర ఖచ్చితంగా అందరికీ స్ఫూర్తినిస్తుంది.” ఈ సందేశంతో ఆయన పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు.
నారా లోకేష్ కూడా ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. “జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్య నాయకులు మరియు జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ప్రజా సేవ మరియు విలువలతో కూడిన రాజకీయాలకు నిబద్ధతకు ప్రతీకగా కొనసాగుతోందన్నారు.
టీడీపీ , జనసేన మధ్య మంచి స్నేహం ఉంది. కూటమిలో ఉన్నా.. అనేక చిన్ నచిన్న సమస్యలు ఉన్నా.. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.





















