Pawan On Modi : ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ పొగడ్తల వర్షం - హిందీలో కూడా !
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో పగ్గా చేపట్టి దేశాన్ని ఏకం చేశారన్నారు.
Pawan On Modi : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయని ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో తన స్పందనలు తెలిపారు.
‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయి. @narendramodi @PMOIndia pic.twitter.com/D3sf7SMaKQ
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022
నరేంద్ర మోదీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతల తెలిపారు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన శ్రీ మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు.
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022
హిందీలోనూ ఇవే అర్థం వచ్చే ట్వీట్లను పెట్టారు. ప్రధానమంత్రిని పొగుడుతూ పవన్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
इस कठोर पृथ्वी पर मनुष्य जितना ऊंचा उठेगा, इतिहास में उसकी छाया उतनी ही लंबी होगी'- शेषेंद्र जी की ये कविताएं
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022
प्रधानमंत्री श्री @narendramodi ji के शासनकाल को दर्शाती हैं।@PMOIndia pic.twitter.com/hSY25ZEwCQ
పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో విశాఖలో సమావేశం అయ్యారు. అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. రాష్ట్రం నుంచి అన్నీ చెప్పానన్నారు. ఆ తర్వాత సమావేశం గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. కానీ మోదీతో భేటీ తర్వాత పవన్ లో అంత ఉత్సాహం కనిపించలేదని.. ఆయన అనుకున్న స్పందన మోదీ వద్ద నుంచి రాలేదన్న విశ్లేషణలు వచ్చాయి. అందుకే మోదీకి కనీసం కృతజ్ఞతలు చెప్పలేదన్న వాదన కూడా కొంత మంది వినిపించారు.
ఈ క్రమంలో సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో తెలుగు, హిందీల్లో .. సమావేశం ఏర్పాటుపై కృతజ్ఞతలు తెలిపారు. మోదీపై పరశంసలు వర్షం కురిపించారు.