Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
Andhra News : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. mసమావేశంలో నాదెండ్ల , పవన్ కూడా పాల్గొన్నారు.
Pavan Meet Chandrababu : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ( Jana sena ) చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ వచ్చిన నారా లోకేష్ ( Nara Lokesh ) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే మార్చిలోనే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో .. కూటమిగా చేయాల్సిన పనులు, సీట్ల సర్దుబాటు, ఇతర ఎన్నికల వ్యూహాలపై వీరు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ మొదటి సారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
కాంగ్రెస్ కొత్త సీఎంకు శాసనమండలి గండం - కాంగ్రెస్‌కు ఒక్క సభ్యుడే ! బిల్లులు ఎలా పాస్ ?
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు పవన్ కల్యాణ్ వరుణ్ తేజ్ వివాహ వేడుకల కోసం ఇటలీలో ఉన్నారు. వచ్చిన తర్వాత సమావేశం అవుతారని అనుకున్నారు కానీ మధ్యంతర బెయిల్ షరతుల కారణంగా విమర్శలు వస్తాయని ఆగిపోయారు. తర్వాత చంద్రబాబు వైద్య చికిత్స కోసం సమయం కేటాయించడంతో పవన్ కల్యాణ్ సమావేశం కాలేకపోయారు. ఈ మధ్యలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు ఆలయాల సందర్శనలో ఉన్నారు.
తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
వర్షాల కారణంగా శ్రీశైలం పర్యటన వాయిదా పడటంతో హఠాత్తుుగా పవన్ కల్యాణ్, నాదెండ్లతో సమావేశం ఖరారయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. సమావేశంలో లోకేష్ కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే మూడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కలిసి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉమ్మడి మేనిఫెస్టోన గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
తెలంగాణలో కాబోయే మంత్రులు వీళ్లేనా?- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్
ఇప్పటికే సీట్ల సర్దుబాటుపైనా రెండు పార్టీల మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చాలా కాలంగా చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీని కలుపుకుని వెళ్లే విషయం పైనా చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు బీజేపీ ఇలా సహకరిస్తున్నంత కాలం.. ఆ పార్టీతో కలిసి పనిచేయడం సాధ్యం కాదన్న వాదన టీడీపీలో ఉంది.