అన్వేషించండి

Telangana Congress : కాంగ్రెస్ కొత్త సీఎంకు శాసనమండలి గండం - కాంగ్రెస్‌కు ఒక్క సభ్యుడే ! బిల్లులు ఎలా పాస్ ?

Telangana Legislative Council : శాసనమండలిలో కాంగ్రెస్ కు ఒక్క సభ్యుడే ఉన్నారు. బిల్లులు అడ్డుకోవాలని టీఆర్ఎస్ అనుకుంటే.. అడ్డుకోవచ్చు. కానీ అలాంటి సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.

Telangana Congress MLC :  తెలంగాణ  శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కావాల్సిన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీకి శాసనమండలిలో అసలు  బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. పెద్దల సభలో బీఆర్‌ఎస్‌కు పూర్తి అధిక్యం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా   గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను కేసీఆర్ సిఫారసు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. కానీ తర్వాత మరో పేర్లను కానీ.. వారి పేర్లను కానీ గవర్నర్‌కు పంపలేదు. దీంతో ఆ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది.

వీరితో కలిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీచేసి గెలుపొందారు. దీంతో వారు శాసన మండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరిలో బీఆర్‌ఎస్‌  నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన శాసన సభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి ,  పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు

  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు.   ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బీజేపీకి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. మిగిలిన 28 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో మండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు.  గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 

 శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది.   ఎవరికైనా ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు పదవులు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీనే నమ్ముకున్న వారికి రేవంత్ ఆ రెండు సీట్లను ఇచ్చే అవకాశం ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించినట్లయితే ఎమ్మెల్సీలుగా ఆరేళ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మళ్లీ చాన్స్ రాదు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget