అన్వేషించండి

Janasena : పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు - అధికార ప్రతినిధులకు పవన్ కల్యాణ్ క్లాస్ !

పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని అధికార ప్రతినిధులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ విధివిధానాలపై వారితో సుదీర్ఘంగా మాట్లాడారు.


Janasena : మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజోపయోగ అంశాల మీద మాత్రమే మాట్లాడాలని  అధికార ప్రతినిధులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.  మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. పార్టీ విధివిధానాలను స్పష్టంగా చెప్పారు.  

రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి !

ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించాలని..  . కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని అధికార ప్రతినిధులకు సూచించారు.  అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలన్నారు. టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు మొదలగు ముఖ్యమైన అంశాలన్నింటిపైనా లోతుగా అధ్యయనం చేసి తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలి. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్ళేలా చూడండి. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా అవి ఉండాలి.  మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు.  చర్చలో పాల్గొనే ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా తూలనాడినా సంయమనం పాటించాలి. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామనే విషయాన్ని  గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 
   
సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పవద్దు ! 

చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడవద్నది అలాగే  సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.  వాటివల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికో లేదా పార్టీ కార్యాలయానికి పంపడమో, దానిపై హడావిడి చేయడమో  చేయవద్దన్నరు. పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దు. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలి. మరెవరికో మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదు. నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దు. అలా స్పందించుకుంటూ వెళ్తే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు - శాశ్వత మిత్రులు ఉండరు 

రో బడ్జెట్ రాజకీయాలు అనే అంశం మీద నేను అభిప్రాయాలు చెప్పలేదు.  అదెలా పుట్టిందో తెలియదుగాని నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ప్రచారం చేశారు. నేను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి కాదు.  ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మన పార్టీ కమ్యునిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొత్తు ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే విషయాన్ని చర్చల్లో అవసరం అయిన సందర్భాల్లో ప్రస్తావించాలి. ఇతర పార్టీలతో జత కట్టకుండా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు ఉండవన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు.  అదే విధంగా ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ నేను వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా వారు నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో కూడా మనం చెప్పలేం. ఒక్కోసారి మన ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని కూడా కలవాల్సిన సందర్బాలు కూడా రావచ్చు. అందువల్ల చర్చల్లో పాల్గొనే వారు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు ముగిశాక మంచిగా పలుకరించుకునే వాతావరణం ఉండాలని పవన్ సూచించారు. 

పార్టీ అధికార ప్రతినిధులతో త్వరలో వర్క్ షాప్ . 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంటులకు ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధుల పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది. పార్టీ అభిప్రాయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది అధికార ప్రతినిధులే. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి వచ్చే నెలలో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామ”న్నారు.  అధికార ప్రతినిధులకు సంబంధించిన వర్క్ షాప్ నిర్వహణకు  శివశంకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
Embed widget