By: ABP Desam | Updated at : 03 May 2023 07:49 PM (IST)
మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్
Devineni Uma Arrest: మైలవరం మార్కెట్ యాడ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనాలని నేషనల్ హైవే పై రాస్తారోకో చేస్తున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తడిసిన ధాన్యం, మొక్కజొన్న వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతులతో కలిసి జాతీయ రహదారి (మైలవరం - చత్తీస్ గడ్) మొక్కజొన్న ధాన్యం పారబోసి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దేవినేని ఉమాను అదుపులోకి తీసుకోవడంతో, టీడీపీ కార్యకర్తలు నిలువరించే ప్రయత్నం చేశారు. ధర్నా చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్రిక్తత నడుమ అరెస్ట్ చేసిన పోలీసులు మైలవరం స్టేషన్ కు తరలించారు.
రైతుల పక్షాన నిలిచానన్న కారణంగా తనను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కోరగా ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను ఇక్కడికి పంపి తనను అరెస్ట్ చేయించిందన్నారు. రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయొద్దని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ అక్కడ నినాదాలతో మార్మోగిపోయింది. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
పోలీసులు దేవినేని ఉమను బలవంతంగా జీపులోకి ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీస్ జీపులో దేవినేని ఉమను తీసుకెళ్తుంటే కొందరు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అయితే నిరసనకారులను పక్కను జరిపి దేవినేని ఉమను పోలీసులు మైలవరం పీఎస్ కు తరలించినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు ఇదివరకే లేఖ రాశారు.
Janasena Varahi Yatra : పవన్ వారాహి యాత్రలో తొలి రోజే బహిరంగసభ - ఎక్కడో ప్రకటించిన జనసేన !
Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు
Harish Rao : ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీకి కష్టాలు - మరోసారి హరీష్ వ్యాఖ్యలు !
Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్నగర్ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా
Nellore 3 MLAs : నెల్లూరులో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి - లైన్ క్లియర్ !
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
జగన్ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు
Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్మెంట్లో బాబాయ్ పవర్ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?
Telangana Poltics : తెలంగాణ చీఫ్ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?