TDP Mahanadu: కడపలో 3 రోజుల పాటు టీడీపీ భారీ వేడుక, అసలు మమహనాడుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగు దేశం పార్టీకి కీలకమై అంశాల్లో మహనాడు ఒకటి. మహానాడు అనే పేరును తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పెట్టారు. 1982 మార్చి 29వ తేదీన టీడీపీకి ఆయన అంకురార్పణ చేశారు.

TDP Mahanadu 2025 | తెలుగు దేశం పార్టీకి కీలకమై అంశాల్లో మహనాడు ఒకటి. మహానాడు అనే పేరును తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పెట్టారు. 1982 మార్చి 29వ తేదీన టీడీపీకి ఆయన అంకురార్పణ చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ జెండా, పార్టీకి ఉండాాల్సి గుర్తు వంటి అంశాలపై చర్చ జరుగుతున్న వేళ ఆయన అదే ఏప్రిల్ 11వ తేదీన బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు తొలి సారిగా మహ నాడు అనే పేరును ఎన్టీఆర్ పెట్టారు. అయితే 1983 లో టీడీపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గుంటూరు పెట్టిన సభను తొలి మహానాడుగా గుర్తించడం జరిగింది.
మహానాడు అంటే అర్థం ఏంటి ?
మహానాడు అనే పేరకు అర్థం ఏంటంటే.. మహా అంటే గొప్ప, నాడు అంటే ప్రాంతం, దేశం లేదా సమావేశం అన్న అర్థం వస్తుంది. ప్రతీ సంవత్సరం తెలుగుదేశం పార్టీ నిర్వహించే పార్టీ సమావేశం. ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు చేసుకునే పార్టీ పండుగ. వీరంతా ఓ చోట చేరి గత ఏడాది పార్టీ వేసిన అడుగులు , సాధించిన విజయాలు, పార్టీకి కలిగన నష్టాలపై విశ్లేషణ చేసుకుంటారు. అయా ఆంశాలపై పార్టీ తీర్మానాలు చేసి మహా నాడు సభలో ఆమోదం తెలియజేస్తారు. ప్రజా సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చ ఉంటుంది. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను ఈ మహానాడులో తయారు చేస్తారు. ఇది టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంగా చెప్పవచ్చు.
మహానాడులోనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
మహనాడులో పార్టీ రాజకీయ,ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అంశాలపై తెలుగు దేశం పార్టీ తీర్మానాలు చేస్తుంది. వాటిపై చర్చిస్తుంది. అంతే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ తీర్మానాలపై తమ స్పందన , ఆమోదం తెలుపుతారు. ఇలా కార్యకర్తలు, నాయకుల భాగస్వామ్యం, వారి వైఖరిని తెలియజేప్పేదే మహనాడు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు కార్యక్రమాల రూపకల్పన చేస్తారు. అంతే కాకుండా మహనాడులో ముఖ్యమైన అంశం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక. టీడీపీ పార్టీ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఓ సారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ప్రక్రియ అంతా మహనాడులోనే జరుగుతుంది. దీన్ని పర్యవేక్షించడానికి ఓ ఎన్నికల అధికారిని ఏర్పాటు చేసుకుంటారు. మహనాడులోనే అధ్యక్షుడి పదవికి నామినేషన్లు స్వీకరించడం, వాటిని పరిశీలించడం, అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతీ మహనాడులో చంద్రబాబు నాయుడే పార్టీ అధ్యక్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎన్నికోవాలని పార్టీ నుండి డిమాండ్లు వస్తున్నాయి.
టీడపీ 40వ మహానాడు కడపలో....
తెలుగు దేశం పార్టీ 1982లో స్థాపిం,చారు. పార్టీ ఆవిర్భవించి నేటికి దాదాపు 43 సంవత్సరాలు గడిచాయి. 1983 నుండి ఈ మహనాడు సమావేశాలు ప్రారంభించనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 1985లో మహనాడు నిర్వహించలేదు. ఎందుకంటే 1984లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు టీడీపీ లో ఓ వర్గం మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ తర్వాత అమెరికా నుండి వచ్చిన ఎన్టీఆర్ జరిగిన రాజకీయ సంక్షోభం పై పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించి తిరిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఈ రాజకీయ సంక్షోభం కారణంగా 1985లో జరగాల్సిన మహనాడును నిర్వహించలేదు. అందుకు ప్రతిగా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి, నాయకులు, కార్యకర్తల ను ఒక్క తాటిపై తీసుకురావడానికి ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఈ కారణంగా మహానాడు జరగలేదు.
అప్పుడు మహానాడు జరగలేదు
1991లో కూడా టీడీపీ మహానాడును నిర్వహించలేదు. 1991లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పార్టీ ఓడిపోవడం, పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడం, రాజకీయ వ్యూహాలను సమీక్షించుకోవడం వంటి కారణాలతో మహనాడును నిర్వహించలేదు. తిరిగి 1996లో కూడా మహానాడు జరగలేదు. అదే ఏడాది ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రెండుగా చీలింది. ఎన్టీఆర్ వైపు ఓ వర్గం, చంద్రబాబు వైపు ఓ వర్గం, పార్టీలో అంతర్గత గందరగోళం కారణంగా మహనాడును నిర్వహించలేదు. అదే ఏడాది జనవరిలో ఎన్టీఆర్ మరణించడం కూడా మహానాడు నిర్వహించకపోవడానికి కారణంగా చెప్పవచ్చు.
ఇక 2012లో ఏపీలో 18 శాసన సభ స్థానాలకు, ఓ లోక్ సభకు ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు టీడీపీకి కీలకమైనవి. వైకాపాను దీటుగా ఎదుర్కొనే వ్యూహంతో టీడీపీ మహనాడును నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం కడపలో నిర్వహిస్తున్న మహనాడు 40 వదిగా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ మహానాడు మే 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.
.






















