News
News
X

SSLV Launch: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డి1 రాకెట్, ఆఖరి స్టేజ్‌లో ట్విస్ట్ - ఏం జరిగిందంటే

ఆదివారం (ఆగస్టు 7) తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయి.. 9.18 నిమిషాలకు SSLV - D1 రాకెట్ ఆకాశంలోకి దూసుకొని వెళ్లింది.

FOLLOW US: 

భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఆదివారం (ఆగస్టు 7) ఉదయం చేపట్టిన SSLV - D1 రాకెట్ ప్రయోగం విషయంలో సస్పెన్స్ నెలకొంది. శ్రీహరి కోట లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం జరిగింది. ఆదివారం (ఆగస్టు 7) తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయి.. 9.18 నిమిషాలకు రాకెట్ ఆకాశంలోకి దూసుకొని వెళ్లింది. అయితే, అన్ని స్టేజ్‌లు తాము ఊహించినట్లుగానే జరిగాయని, కానీ, టెర్మినల్ స్టేజ్‌లో డేటా లాస్ జరిగిందని ఇస్రో ట్వీట్ చేసింది. దాని గురించి తాము విశ్లేషణ చేస్తున్నామని పేర్కొన్నారు. రాకెట్ స్థితిపై త్వరలోనే అప్ డేట్ ఇస్తామని ఇస్రో ట్వీట్ చేసింది.

ఈ SSLV - D1 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 తో పాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్ ను 500 కిలో మీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని 75 స్కూళ్లకు చెందిన స్టూడెంట్స్ యారు చేశారు. ఇది షార్ నుంచి చేసిన 83వ రాకెట్ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగమే మొదటిది.

శాటిలైట్స్ వివరాలు

ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలించనుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఇంకో ఉపగ్రహం ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని తయారు చేశారు. భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. ఈ ఆజాదీ శాట్ పని చేసే లైఫ్ 6 నెలలు మాత్రమేజ. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను ఫీడ్ చేశారు.

SSLV రాకెట్ ఎందుకు?
ఇస్రో ఇప్పటిదాకా శాటిలైట్స్ ను నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడానికి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లను వాడేది. దీన్ని తయారుచేయడానికి 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లు మాత్రమే. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీ కోసం వెచ్చించే శ్రమ, ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే ఇస్రో చిన్నగా లేదా తక్కువ బరువు ఉండే ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చడానికి ఎస్ఎస్ఎల్వీ వైపు మొగ్గు చూపింది. ఈ ఎస్ఎస్ఎల్వీ రాకెట్ పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న కమర్షియల్ శాటిలైట్స్ ను కక్ష్యలోకి తీసుకెళ్లగలదు.

Published at : 07 Aug 2022 09:38 AM (IST) Tags: ISRO Sriharikota SSLV SSLV-D1 SSLV-D1EOS-02 ISRO launches SSLV-D1

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Nellore Love Story: ప్రేమించాడు, పెళ్లి మాటెత్తితే గోడదూకి పారిపోయాడు - లాక్కొచ్చి పెళ్లి చేశారు

Nellore Love Story: ప్రేమించాడు, పెళ్లి మాటెత్తితే గోడదూకి పారిపోయాడు - లాక్కొచ్చి పెళ్లి చేశారు

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Minister Kakani : ఓటమి భయంతో చంద్రబాబు కుప్పం నుంచి పారిపోతారు- మంత్రి కాకాణి

Minister Kakani : ఓటమి భయంతో చంద్రబాబు కుప్పం నుంచి పారిపోతారు- మంత్రి కాకాణి

Nellore Triangle Love Story: ఆయనకిద్దరూ - కానీ ఆవిడ అంత తేలిగ్గా ఒప్పుకోలేదు, చివరికి హ్యపీ ఎండింగ్

Nellore Triangle Love Story: ఆయనకిద్దరూ - కానీ ఆవిడ అంత తేలిగ్గా ఒప్పుకోలేదు, చివరికి హ్యపీ ఎండింగ్

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?