News
News
వీడియోలు ఆటలు
X

Fact Check: మాజీ మంత్రి అనిల్ ఫ్లెక్సీకి 15 మంది పోలీసులతో బందోబస్తు - ఈ వార్తలో నిజమెంత ?

ఫొటోలు వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు పోలీసులు భద్రత కల్పించడం వరకు ఓకే కానీ.. ఇలా ఫ్లెక్సీకి కూడా 15 మంది పోలీసులతో భద్రత కల్పించడం అవసరమా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

FOLLOW US: 
Share:

EX Minister Anilkumar: ఏపీ మాజీ మంత్రి అనిల్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలో వేసిన ఓ ఫ్లెక్సీకి 15 మంది పోలీసులు భద్రత కల్పించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. నిజంగానే ఆ ఫొటోలో అనిల్ ఫ్లెక్సీ ముందు 15మంది పోలీసులున్నారు. అందులో ఓ సీఐ కూడా ఉన్నారు. ఆ ఫొటో ఫేక్ ఏమాత్రం కాదు. ఆ ఫొటో నిజమే, అందులో పోలీసులు ఉన్నది కూడా నిజమే. కానీ ఆ పోలీసులు అనిల్ ఫ్లెక్సీ రక్షణకోసం వచ్చారా, నిత్యం అక్కడ ఫ్లెక్సీకి రక్షణగా పహారా కాశారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. 

నర్తకి సెంటర్లో రాజకీయం..
నెల్లూరు నర్తకి సెంటర్ అంటే టీడీపీ కార్యక్రమాలకు పెట్టింది పేరు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ రాజకీయ, సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఒకరకంగా పార్టీ ఆఫీస్ కంటే నెల్లూరులో టీడీపీకి కేరాఫ్ అడ్రస్ నర్తకి సెంటర్ అనే చెప్పాలి. అలాంటి నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ముందు అనిల్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ వేయడంతో అసలు వివాదం మొదలైంది. వైసీపీలో ఉన్న అనిల్ అభిమానులు కావాలనే ఆ సెంటర్లో భారీ ఫ్లెక్సీ పెట్టి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే దాన్ని టీడీపీ వాళ్లు ఎక్కడ ముక్కలు ముక్కలు చేస్తారోననే అనుమానం వారిలో ఉంది, అందుకే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారహు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

అసలే నెల్లూరంటే ఫ్లెక్సీల గోల ఎక్కువ. గతంలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఫ్లెక్సీలను కొంతమంది చించేశారని, ఆనం సెంటర్లో రచ్చ రచ్చ జరిగింది. అప్పట్లో అనిల్ వర్గంపైనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ ఫ్లెక్సీలు, ఆయన ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలో చించేస్తే ఇంకేమైనా ఉందా..? అందుకే పోలీసులు టెన్షన్ పడుతున్నారు. 

కాపలా ఎందుకు..?
ఇటీవల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వైసీపీలో చేరారు. నెల్లూరు వచ్చిన తర్వాత ఆయన తొలిసారిగా నర్తకి సెంటర్ కి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలనుకున్నారు. ఆ సమయానికి అక్కడ అనిల్ ఫ్లెక్సీ ఉంది. నెల్లూరులో కెటంరెడ్డి వర్సెస్ అనిల్ రాజకీయం ఎలా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు టైమ్ దొరికుతుందా అని ఇరు వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు ఏం చేస్తారోనన్న అనుమానంతో పోలీసులు వచ్చారు. అయితే ఆ స్థాయిలో ఖాకీలు ఫ్లెక్సీని రౌండప్ చేయడం, కోటంరెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయే వరకు వారు కూడా అక్కడే ఉండటంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల కాపలా కాశారు అంటూ విషయం వైరల్ గా మారింది. 

నెల్లూరు పోలీసులకు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఫ్లెక్సీకి రక్షణగా పోలీసుల్ని పంపించాలంటే మరీ సిల్లీగా ఉంటుందని తెలిసినా.. ఆ ఫ్లెక్సీ చించితే నెల్లూరులో గొడవలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ముందు జాగ్రత్తగా పోలీసులు అక్కడ ఆ పని చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులు కూడా సోషల్ మీడియాలో కార్నర్ అయ్యారు.  

సోషల్ మీడియాలో ట్రోలింగ్..
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు పోలీసులు భద్రత కల్పించడం వరకు ఓకే కానీ.. ఇలా ఫ్లెక్సీకి కూడా 15 మంది పోలీసులతో భద్రత కల్పించడం అవసరమా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలపై నిషేధం ఉంది. వాటిని నిషేధించామని, ఎవరైనా ఏర్పాటు చేస్తే తొలగిస్తామని, తన ఫ్లెక్సీలు కూడా ఎవరూ పెట్టొద్దని స్వయంగా మాజీ మంత్రి అనిల్ గతంలో చాలాసార్లు చెప్పారు. ఆ పని చేసి చూపించారు కూడా. ఇప్పుడు ఆయన ఫ్లెక్సీలకే పోలీసుల రక్షణ మాత్రం నెల్లూరులో కలకలం రేపింది. 

Published at : 27 Mar 2023 09:17 PM (IST) Tags: Nellore Anil Kumar Yadav Nellore News Anil Kumar Flexi

సంబంధిత కథనాలు

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Anantapur: భార్య నల్లపూసల దండ మింగేసిన భర్త, 3 నెలల తర్వాత విషయం వెలుగులోకి

Anantapur: భార్య నల్లపూసల దండ మింగేసిన భర్త, 3 నెలల తర్వాత విషయం వెలుగులోకి

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

టాప్ స్టోరీస్

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?