అన్వేషించండి

Nellore News : నిజాయితీ అధికారులతో దళారీలకు చిక్కులు, ఆకాశ రామన్న పేరుతో తప్పుడు ఫిర్యాదులు!

అధికారులు ఒరిజినల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల కోసం పట్టుబడుతుండటంతో.. దళారీల ఆటలు సాగడంలేదు. దీంతో వారంతా పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.

రవాణా శాఖలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. వాహనాల రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి, డ్రైవింగ్ లైసెన్స్ ల వరకు అన్నింట్లోనూ అవినీతికి ఆస్కారం ఉంది. చేయి తడపనిదే పనికాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు నేరుగా ఆఫీస్ కి వెళ్లి పని చేయించుకోవడం కుదరదని దళారీలను ఆశ్రయిస్తుంటారు సామాన్య ప్రజలు. అదే అదనుగా ఆర్టీఏ ఆఫీస్ ల వద్ద తిష్టవేసుకుని ఉండే దళారీలు లోపల కొంతమంది సిబ్బందిని మచ్చిక చేసుకుని తమ పనులు పూర్తి చేసుకుంటుంటారు. చివరకు ఆ భారమంతా ప్రజలపైనే మోపుతారు. లోపల లంచాలు ఇవ్వనిదే పనికాదని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో కొన్న వాహనాలను నెల్లూరుకి తీసుకొచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారనే ఫిర్యాదుతో పెద్దస్థాయి అధికారులు బలయ్యారు. ఆ మచ్చ అలా ఉండగానే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. పదే పదే నెల్లూరుకి చెందిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఆకాశ రామన్న ఉత్తరాలు అందుతున్నాయి. పలానా మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అసిస్టెంట్ ఎంవీఐలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని, హెడ్ ఆఫీస్ కి ఏజెంట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏజెంట్లు తమకు తాముగా ఈ ఫిర్యాదులు చేయకుండా సామాన్య ప్రజల రూపంలో ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తున్నారు. వెబ్ సైట్స్ లో కంప్లయింట్లు పెడుతున్నారు.

Nellore News : నిజాయితీ అధికారులతో దళారీలకు చిక్కులు, ఆకాశ రామన్న పేరుతో తప్పుడు ఫిర్యాదులు!

అసలు విషయం ఏంటంటే..?

నెల్లూరుతోపాటు చాలా చోట్ల ఆర్టీఐ ఆపీసుల్లో ఇలాంటి సమస్య ఉంది. ఫిట్ నెస్ సర్టిఫికెట్లను నిర్ణీత సమయంలోగా వాహనదారులు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా రెన్యువల్ చేయించుకోవాలంటే కచ్చితంగా ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే వాహనదారులు ఇన్సూరెన్స్ చెల్లించడానికి వెనకాడుతుంటారు. ఈ క్రమంలో దళారీలు రంగప్రవేశం చేస్తుంటారు. ఇన్సూరెన్స్ లేకుండానే దానికి పెట్టే ఖర్చులో సగం ఖర్చుతో పనికానిచ్చేస్తామంటూ నమ్మబలుకుతుంటారు. డూప్లికేట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు చూపించి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు తెప్పిస్తుంటారు. ఇటీవల కాలంలో వచ్చిన ఉద్యోగులు దళారీలకు సహకరించడంలేదు. డూప్లికేట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను వారు వెబ్ సైట్ లో సరిచూస్తున్నారు. వెబ్ సైట్స్ లో ఆయా కంపెనీల ఇన్సూరెన్స్ నెంబర్లతో వాటిని పోల్చి చూస్తున్నారు. ఇన్సూరెన్స్ ఒరిజినల్ కాదు అని తేలితే వెంటనే ఫిట్ నెస్ కి కొర్రీలు పెడుతున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న కొంతమంది అధికారులతో దళారీలకు గిట్టుబాటు కావడంలేదు. దీంతో వారు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు.

అధికారులు ఒరిజినల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లకోసం పట్టుబడుతుండటంతో.. దళారీల ఆటలు సాగడంలేదు. దీంతో వారంతా పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎంవీఐలు, అసిస్టెంట్ ఎంవీఐలు వేధిస్తున్నారని ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తున్నారు. వేర్వేరు ఫోన్లనుంచి టోల్ ఫ్రీ నెంబర్లకు కంప్లయింట్ లు పెడుతున్నారు. దీంతో నిజాయితీగా పనిచేస్తున్న సిబ్బంది తమకెందుకీ కష్టాలంటూ ఇబ్బంది పడుతున్నారు. దళారీలు మానసికంగా వేధిస్తున్నా తాము మాత్రం ఉద్యోగానికి ద్రోహం చేయబోమంటున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల వద్దకు వస్తున్న ఫిర్యాదులు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget