News
News
X

యువగళం పూర్తయ్యేసరికి టీడీపీ నెత్తిన తడిగుడ్డే- చంద్రబాబు, లోకేష్, పవన్ కి ఎమ్మెల్యే అనిల్ సెటైర్లు

లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్ కి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని చెప్పారు అనిల్.

FOLLOW US: 
Share:

వైనాట్ -175 అంటూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతూనే, తాజాగా ప్రతిపక్షాలను కార్నర్ చేశారు. ప్రతిపక్షాలు కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించగలవా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కేవలం జగన్ ప్రశ్నించి వదిలేస్తే ఓకే, కానీ ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ అదే ప్రశ్న అడిగిస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రతిపక్షాలపై జగన్ ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమవుతోంది.

సింగిల్ గా వస్తారా..

ప్రతిపక్షాల కచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేస్తాయి. పులివెందులలో కూడా అభ్యర్థిని నిలబెడతాయి. కానీ ఇక్కడ జగన్ అడుగుతోంది ఒక్కటే. ప్రతిపక్షాలు విడివిడిగా 175 స్థానాల్లో పోటీ చయగలవా అని అడుగుతున్నారు. అంటే ప్రతిపక్షాలకు విడివిడిగా అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందా అంటూ పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. తెనాలిలో రైతు భరోసా సభ తర్వాత మంత్రి కాకాణి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న సంధించారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో కూడా 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కి.. మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. టీడీపీ, జనసేనకు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. తమకు పొత్తులు అవసరం లేదని, అప్పుడు సింగిల్ గానే పోటీ చేశామని, ఇప్పుడు కూడా సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పారు. టిడిపి, జనసేన కు ఆ సత్తా ఉందా అని సవాల్ విసిరారు. దమ్ముంటే యువగళం పాదయాత్రలో ఆమేరకు లోకేష్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అనిల్. కనీసం పోటీ చేసే స్థానాల సంఖ్య చెప్పుకోలేని పార్టీలు, సీఎం జగన్ గురించి మాట్లాడతాయా అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు అనిల్.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాదే..

పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.  టీడీపీ హయాంలో కంటే తమ హయాంలోనే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చామని చెప్పారు మాజీ మంత్రి అనిల్. టీచర్లకు కూడా తమ హయాంలోనే ఎక్కువ బెనిఫిట్స్ లభించాయని చెప్పారు. పట్టభద్రులు, టీచర్లు తమకే మద్దతు తెలపాలన్నారు. సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

టీడీపీ, జనసేనకు సింగిల్ గా పోటీ చేసే సత్తా లేదని అందుకే వారంతా కలసి పోటీ చేయాలనుకుంటున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. దమ్ముంటే వారు సింగిల్ గా పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్ కి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని చెప్పారు అనిల్. మొత్తమ్మీద ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయాలని అధికార పక్షం కోరుకుంటున్నట్టుంది. అందుకే ఇప్పుడు నేతలు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే విడివిడిగా రండి, పోటీ చేస్తామని ప్రకటించండి అంటున్నారు వైసీపీ నేతలు.

Published at : 02 Mar 2023 02:20 PM (IST) Tags: AP Politics Nellore Update Nellore News Nellore Politics nellore city mla anil anil kumay yadav

సంబంధిత కథనాలు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి