కాకాణి గోవర్థన్
టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు నిధులిచ్చారంటూ తప్పుడు లెక్కలు చూపించారని, ఆ తప్పుడు లెక్కలతో డబ్బులన్నీ చంద్రబాబు అకౌంట్ కి వెళ్లాయని, అందుకే ఇప్పుడాయన జైలులో ఊచలు లెక్కబెడుతున్నారని అన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో కూడా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల పేరుతో పెద్ద అవినీతి జరిగిందన్నారు. స్కిల్ సెంటర్లకు టీడీపీ నేతలు వెళ్లి హడావిడి చేయాలని చూసినా ఫలితం లేదన్నారు.
శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కాలేజీలను, విక్రమ సింహపురి యూనివర్శిటీని టీడీపీ నేతలు సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ స్కిల్ సెంటర్లకోసం టీడీపీ పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదని తేలిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు కాకాణి. అక్రమాలు జరగలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు విక్రమ సింహపురి యూనివర్శిటీలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసుపాలయ్యారని చెప్పారు కాకాణి. విక్రమ సింహపురి యూనివర్శిటీకి, ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో వారికి ఏంచేయాలో తెలియలేదన్నారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లారని, అక్కడ కూడా హడావిడి చేసినా ఫలితం లేదన్నారు. ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీలో స్కిల్ సెంటర్ కి 10కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేది టీడీపీ వాదన.
కానీ అక్కడ ఎక్విప్ మెంట్ అంతటికీ కలిపి కనీసం 2కోట్లరూపాయలు కూడా ఖర్చు కాలేదని యాజమాన్యం చెప్పిందంటున్నారు కాకాణి. ఆ 2కోట్ల రూపాయలకు కూడా ఇన్ వాయిస్ లు లేవన్నారు. అంటే అక్కడ స్కిల్ సెంటర్ కి ఖర్చు పెట్టింది అంతకంటే తక్కువేనన్నారు. గూడూరు ఇంజినీరింగ్ కాలేజీలో స్కిల్ సెంటర్ కోసం టీడీపీ హయాంలో రూ.10కోట్లు ఖర్చు పెట్టారని నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి వైదొలగుతానన్నారు కాకాణి. వాస్తవంగా అక్కడ స్కిల్ సెంటర్ కి టీడీపీ ప్రభుత్వం రూ.80 కోట్లు ఇవ్వాలని, కానీ రూ.70 కోట్లు తినేశారని మండిపడ్డారు.
ఖాళీ కంచాలు చేసింది మీరే..
టీడీపీ నేతలు నిన్న కంచాలు.. గరిటెలు మోగించి హడావిడి చేశారని, వాస్తవానికి ఆ ఖాళీ కంచాలకు బ్రాండ్ అంబాసిడర్లు వారేనని ఎద్దేవా చేశారు కాకాణి. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నాన్ని టీడీపీ నేతలు తినేశారని, అందుకే అవి ఖాళీ కంచాలు అయ్యాయన్నారు. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి కాకాణి ఆరోపించారు.
ఉత్తర కుమార ప్రగల్భాలు..
అరెస్ట్ విషయంలో ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేష్ చివరకు అరెస్ట్ భయంతో ఢిల్లీ వెళ్లి కూర్చున్నారని విమర్శించారు మంత్రి కాకాణి. ఢిల్లీలో లోకే ష్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదని, టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రపతి భవన్ ముందు, ప్రధాని మోదీ కార్యాలయం ముందు కంచాలు మోగించాలన్నారు. ఆదాయపన్ను శాఖ ముందు కానీ, ఈడీ కార్యాలయం ముందుకానీ కంచాలు కొట్టాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ లో కూడా అక్రమాలు జరిగాయన్నారు కాకాణి. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈలలు వేసి డప్పులు కొట్టి చేపట్టిన కార్యక్రమం నిరసనగా లేదని, అవి సంబరాలుగా ఉన్నాయని చెప్పారు.
Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP High Court: ఎస్ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Polytechnic Branches: పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>