అన్వేషించండి

Kotamreddy: ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది, అనిల్‌కి ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రాజకీయం ఓ రేంజ్ లో వేడెక్కింది. చాలా కాలం గ్యాప్ తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి రావడం, వచ్చీ రాగానే ఆయన లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేయడం, అందులోనూ అరేయ్, ఒరేయ్ అంటూ కాస్త ఘాటు పదాలు వాడటంతో టీడీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి.. తాజాగా అనిల్ ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అనిల్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని, ఉన్నన్ని రోజులైనా ఆయన నియోజకవర్గ ప్రజలతో మంచి అనిపించుకోవాలని హితవు పలికారు. 

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి. అనిల్ భాషను ఆ నియోజకవర్గం ప్రజలే అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. అరేయ్, ఒరేయ్, ఏరా.. అంటూ అనిల్ మాట్లాడటం సరికాదన్నారు. వాళ్లను కొడతాం, వీళ్లను కొడతామంటున్న అనిల్.. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 

టార్గెట్ అనిల్..
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడి పెంచారు. నారా లోకేష్ పై ఆయన చేసిన విమర్శలు కౌంటర్లిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుండటంతో నాయకులు విమర్శలకు పదును పెట్టారు. లోకేష్ తరపున మాట్లాడి అధినాయకుడి దృష్టిలో పడేందుకు అనిల్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి.. గతంలో ఎప్పుడూ అనిల్ పై ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు వారు సోదర భావంతో మెలిగేవారు. లోలోపల రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తున్నా కూడా ఒకరి నియోజవర్గంలో మరొకరు వేలు పెట్టేవారు కాదు, ఎవరి పరిధిలో వారు ఉండేవారు. ఇప్పుడు కోటంరెడ్డి సోదరులు పార్టీ మారడంతో గొడవ మొదలైంది. నెల్లూరు సిటీ పరిధిలో కూడా కోటంరెడ్డి సోదరులు ప్రభావం చూపిస్తున్నారు. సిటీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సిటీలోని టీడీపీ నాయకులతో టచ్ లోకి వెళ్తున్నారు. అనిల్ వ్యతిరేక వర్గంతో కూడా వారు సఖ్యతతో ఉన్నారు. 

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కి టికెట్ రాదని టీడీపీ ప్రచారం చేస్తోంది. అనిల్ వ్యతిరేక వర్గంగా వైసీపీలోనే ఉన్న నాయకులు కూడా ఆయనకు టికెట్ రాదని అంటున్నారు. ఆయితే ఆయన మాత్రం 2024లో నెల్లూరు సిటీలో పోటీ చేసేది తానేనని ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్నారు. తనకు టికెట్ రాకుండా ఆపగలికే శక్తి కేవలం జగన్ కి మాత్రమే ఉందంటున్నారు. అనిల్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ దశలో ఇప్పుడు టీడీపీ కూడా ఆయనపై మూకుమ్మడి దాడి మొదలు పెట్టింది.  దీంతో ఆయన కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget