By: ABP Desam | Updated at : 09 Dec 2021 09:25 AM (IST)
న్యూడ్ వీడియో కాల్ (ప్రతీకాత్మక చిత్రం)
కొన్నిరోజుల క్రితం నెల్లూరు నగరానికి చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడికి రాత్రి సమయంలో వాట్సప్ లో అన్ నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలియని నెంబర్ అయినా ఆయన దాన్ని రిసీవ్ చేసుకున్నారు. తీరా కాల్ కనెక్ట్ అయిన వెంటనే అవతలినుంచి ఓ మహిళ ఒక్కొక్కటిగా తన దుస్తుల్ని తీసేసింది, నగ్నంగా మారిపోయింది. అసలేం జరిగిందో, ఏం జరిగిందో అర్థం కాక ఆ ఆయుర్వేద డాక్టర్ కాల్ కట్ చేశారు. ఆ తర్వాత వెంటనే వాయిస్ కాల్ వచ్చింది. మీరు ఫలానా మహిళ నగ్నంగా ఉండగా వీడియో కాల్ మాట్లాడారు అంటూ వాటి రికార్డింగ్ లు పంపించారు. సదరు మహిళ నగ్నంగా ఉన్న వీడియో.. అవతల కాల్ మాట్లాడుతున్నట్టు డాక్టర్ వీడియో ఈ రెండూ అందులో ఉన్నాయి. అంతే కాదు.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారందరికీ ఈ వీడియో వెళ్తుంది అని బెదిరించారు. అయితే ఇక్కడ డాక్టర్ బెదిరిపోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటూ ఫోన్ కట్ చేశారు..
నెల్లూరుకి సంబంధించి మరో విలేకరి స్నేహితుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. రాత్రిపూట తెలియని నెంబర్లనుంచి వీడియో కాల్ రాగానే ఆన్సర్ చేసిన ఆ వ్యక్తి అవతల నగ్నంగా కనిపిస్తున్న మహిళను చూసి షాక్ అయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ వెంటనే బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అయితే అతను కూడా భయపడకుండా.. వారిని రివర్స్ లో బెదిరించే సరికి వ్యవహారం అక్కడితో ఆగింది.
ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోనే కాదు.. చాలా చోట్ల ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. చాలా వరకు బాధితులు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు సమర్పించుకుంటూనే ఉన్నారు. మరికొంతమంది మాత్రం మోసగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోలీసులకు చేరని వ్యవహారం..
పరువుకి సంబంధించిన విషయం కావడంతో దీన్ని ఎవరూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలేదు. కేవలం స్నేహితులతో మాత్రమే దీని గురించి చర్చిస్తున్నారు. వారెవరూ కూడా అలా మోసపోకండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతం అయిన తర్వాత మోసగాళ్లకు సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కువయ్యాయి. ఏమాత్రం కష్టం లేకుండా ఇలాంటి వీడియోలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో బ్యాంక్ కి సంబంధించి ఎక్కువగా మోసాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇలా వాట్సప్ వీడియో కాల్స్ ద్వారా కూడా మోసాలు ఎక్కువయ్యాయి. సో.. బీ అలర్ట్. పొరపాటున ఇలాంటి మోసగాళ్ల బారిన పడినా.. ధైర్యంగా ఉండండి. బ్లాక్ మెయిల్స్ కి లొంగకుండా పోలీసుల్ని ఆశ్రయించండి.
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
ఏందయ్యా ఇది-నువ్వు కూడానా? ఉదయగిరి ఎమ్మెల్యేకు మంత్రి కాకాణి క్లాస్!
దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి సవాల్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!
AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్‌డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!