ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్
గతంలో ముగ్గురూ కలసి ఉందామని అనుకున్నా ఇప్పుడు కుదరదని తెగేసి చెప్పింది. తన భర్త తనకు మాత్రమే సొంతమని, గతంలో చేసుకున్న వివాహం చెల్లదని అంటోంది చిన్న భార్య నిత్యశ్రీ.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ టిక్ టాక్ మ్యారేజ్ జరిగింది. పెద్ద భార్య పెద్ద మనసుతో తన భర్తకు రెండో పెళ్లి చేసింది. ఈ విషయం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. చిన్న భార్య గొడవ మొదలు పెట్టింది. గతంలో ముగ్గూరు కలసి ఉందామని అనుకున్నా ఇప్పుడు కుదరదని తెగేసి చెప్పింది. తన భర్త తనకు మాత్రమే సొంతమని, గతంలో చేసుకున్న వివాహం చెల్లదని అంటోంది చిన్న భార్య నిత్యశ్రీ.
అసలేం జరిగింది.?
ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ కి చెందిన కల్యాణ్ కు, విశాఖకు చెందిన నిత్యశ్రీతో టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత జీవితంలో స్థిరపడాలని చెబుతూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు కల్యాణ్. కట్ చేస్తే.. ఇక్కడ నిత్యశ్రీతో ఆయన ఫోన్ చాటింగ్ కొనసాగిస్తూనే సడన్ గా ఓ రోజు విమల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న నిత్యశ్రీ కల్యాణ్ ఇంటికి వచ్చి గొడవ చేసింది. దీంతో విమల పెద్ద మనసు చేసుకుని పెళ్లి పెద్దగా మారి కల్యాణ్ కు నిత్యశ్రీకి వివాహం చేసింది. ఆ వివాహం సమయంలో ముగ్గురూ కలసి ఒకేచోట ఉండాలని నిర్ణయించుకున్నారు.
కథ అడ్డం తిరిగింది..
టిక్ టాక్ లవ్ స్టోరీ, పెద్ద భార్య అనుమతితో భర్తకు రెండో పెళ్లి అంటూ ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో నిత్యశ్రీ ఇబ్బంది పడింది. కల్యాణ్ తనకు సెకండ్ హ్యాండ్ మొగుడు కాదని, తమదే అసలైన పెళ్లి అని అంటోంది నిత్యశ్రీ. విమల దగ్గరకు కల్యాణ్ ని పంపించబోనని చెబుతోంది. ప్రస్తుతం నిత్యశ్రీ డక్కిలిలోని అంబేద్కర్ నగర్ లో కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలసి ఉంటోంది. కల్యాణ్ మాత్రం కడపలో విమల ఇంటికి వెళ్లాడు.
విమలకు రెండో పెళ్లి..
గతంలో విమలకు పెళ్లైందని, ఆమెకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడని, ఆ తర్వాత ఆమె కల్యాణ్ ని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందని ఆరోపిస్తోంది నిత్యశ్రీ. అసలా పెళ్లి చెల్లదని చెబుతోంది. మరి ముగ్గురూ కలసి ఉంటామని ఒకే మాటపైకి వచ్చారు కదా అని ప్రశ్నిస్తే మాత్రం ఆ నిర్ణయాన్ని తాను మార్చుకున్నానని చెబుతోంది. కల్యాణ్ ని విమల దగ్గరకు పంపించబోనని, ఆయన తనకే సొంతం అంటోంది. ముగ్గురూ ఒకేచోట కలసి ఉండే ప్రసక్తే లేదన చెబుతోంది నిత్యశ్రీ.
కల్యాణ్ కుటుంబ సభ్యులు మద్దతు ప్రస్తుతం నిత్యశ్రీకే ఉంది. విమలకు గతంలోనే పెళ్లైందన్న వార్తల నేపథ్యంలో ఆమెను కోడలిగా స్వీకరించేందుకు కల్యాణ్ కుటుంబ సభ్యులు అంగీకరించడంలేదు. దీంతో నిత్యశ్రీ మాత్రమే అత్తగారింటిలో ఉంటోంది. కల్యాణ్ మాత్రం విమలకోసం కడపకు వెళ్లాడు. అతను తిరిగి వస్తే పంచాయితీ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విమల మీడియా ముందుకు రాకపోయినా, నిత్యశ్రీ మాత్రం ఈ గొడవ పెద్దది చేసి కల్యాణ్ ని తనతోనే ఉండిపోయాల చేసుకోవాలనుకుంటోంది.