News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Atmakur Bypoll: ఆత్మకూరులో ప్రశాంతంగా మొదలైన పోలింగ్, పోలింగ్ శాతం డౌటే! కారణం ఏంటంటే

ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఆరు గంటలనుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ చేపట్టారు. అనంతరం ఏడుగంటలనుంచి పోలింగ్ మొదలైంది.

FOLLOW US: 
Share:

ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఆరు గంటలనుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ చేపట్టారు. అనంతరం ఏడుగంటలనుంచి పోలింగ్ మొదలైంది.  ఆత్మకూరులో మొత్తం 279 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆరు మండలాలకు సంబంధించి 377 ఈవీఎంలతో పోలింగ్ జరుగుతోంది. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో 148 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. 2,13,338 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.

14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో నిలిచారు. మొత్తం 14మంది అభ్యర్థులు ఈరోజు ఉప ఎన్నికల పోటీలో ఉన్నారు. 2,13,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 

ఆత్మకూరు ప్రశాంతంగానే కనిపిస్తున్నా.. పోలింగ్ కేంద్రాల్లో 44 శాతం సమస్యాత్మకమైనవేనని అధికారులు నిర్థారించారు. మొత్తం 6 మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 123 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు  అక్కడ అదనపు బలగాలను మోహరించారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో గొడవలు జరిగే అవకాశం లేదని అనుకున్నా.. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు ముందు జాగ్రత్త తీసుకున్నారు. 123 కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. 

పోలింగ్ శాతంపై సందేహం.. 
విజయంపై ఇప్పటికే ధీమాగా ఉన్న అధికార వైసీపీ.. లక్ష మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. పోలింగ్ శాతం వీలైనంత మేర పెంచేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఆ స్థాయిలో పోలింగ్ కి జనం ఆశక్తి చూపిస్తారా లేదా అనేది సందేహమే. ఇప్పటికే పల్లెల్లో చాలామంది నర్రవాడలో జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నవారు కూడా గత ఎన్నికలకోసం తరలి వచ్చినట్టు ఈసారి రావడంలేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందనే అంచనాలున్నాయి. 

వాతావరణంలో మార్పు.. 
నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోతున్నా.. రాత్రి నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షం పడితే ఓటింగ్ శాంత తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యే అవకాశముంది. 

Published at : 23 Jun 2022 07:36 AM (IST) Tags: Nellore news Mekapati Goutham Reddy atmakur news mekapati vikram reddy Atmakur Bypoll atmakur bypoll news

ఇవి కూడా చూడండి

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బక్‌లారియెట్‌ సిలబస్‌, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బక్‌లారియెట్‌ సిలబస్‌, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక- సమావేశాలు ముగిసేవరకు ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక- సమావేశాలు ముగిసేవరకు ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్