అన్వేషించండి
In Pics: రాకెట్లతో పవన్ కల్యాణ్ ఫోటోలు - శ్రీహరి కోటలో జనసేనాని సందడి
Srihari Kota News: శ్రీహరికోట షార్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని విభాగాల గురించి శాస్త్రవేత్తలు ఆయనకు వివరించారు.

పవన్ కల్యాణ్
1/8

శ్రీహరికోట షార్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు.
2/8

అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని విభాగాల గురించి శాస్త్రవేత్తలు వివరించారు.
3/8

శ్రీహరికోట షార్ కేంద్రంలో నిర్వహించిన నేషనల్ స్పేస్ డే 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
4/8

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘నేను నెల్లూరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రసాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ ఉండేది. స్కూళ్లో టీచర్ ను పదేపదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడిని. టీచర్ నాలో ఉన్న తపనను గుర్తించి... నన్ను స్కూలు సైన్స్ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనా తయారు చేసి తీసుకురమ్మన్నారు.
5/8

నానా రకాల పాట్లు పడి... అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్ నమూనా తయారు చేయడానికే నాకు చుక్కలు కనిపించాయి. మరి అంతరిక్షంలోకి ప్రయోగించే, అక్కడ పని చేసే ఉపగ్రహాల తయారీకి, వాటి ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో అన్న ఆలోచన నాకు శాస్త్రవేత్తలపై అమితమైన గౌరవాన్ని పెంచింది.
6/8

చిన్నస్థాయిలో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయాణం నాకు స్ఫూర్తిదాయకం.
7/8

శ్రీహరికోటకు హెలికాప్టర్ లో వస్తున్న సమయంలో పైనుంచి ఈ ప్రయోగ ద్వీపాన్ని చూస్తుంటే ముచ్చటేసింది.
8/8

పచ్చగా అడవిని తలపించేలా షార్ కనిపించింది. శ్రీహరికోట నిర్మాణం ఓ అద్భుతం. చుట్టూ సముద్రం, మరో పక్క సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో అంతరిక్ష ప్రయోగశాల నిర్మాణం దేశానికే తలమానికంగా నిర్మించుకోవడం గొప్ప విశేషం.
Published at : 13 Aug 2024 06:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion