News
News
X

ఈనెల 27న నెల్లూరు పర్యటనకు సీఎం జగన్- అడ్డుకుంటామంటున్న వామపక్షాలు

ఈనెల 27న నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు సీఎం జగన్. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ ని జాతికి అంకితం చేయబోతున్నారు.

FOLLOW US: 

ఈనెల 27న నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు సీఎం జగన్. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ ని ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షించారు.


అడ్డుకుంటాం..

ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు వామపక్షాల నేతలు. వారికి టీడీపీ, జనసేన, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది. జెన్ కోని ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారంతో ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. జెన్ కో పర్యవేక్షణకు వచ్చిన అధికారుల కార్లను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు.

News Reels


ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికాగా ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతోంది. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ పనిచేస్తోంది.


థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమకూర్చుకోగలిగారు. కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఈ ప్రాజెక్ట్ కి ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 

మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెల 27న దీన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. అధికారులు హడావిడి పడుతున్నారు. సీఎం జగన్ టూర్ కి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేపట్టారు.

Published at : 17 Oct 2022 09:35 PM (IST) Tags: nellore abp Nellore News apgenco cm jagan to nellore

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

ఎమ్మెల్యే అనిల్ ఇంటి ముందు బీజేపీ నిరసన - పరిస్థితి ఉద్రిక్తం

ఎమ్మెల్యే అనిల్ ఇంటి ముందు బీజేపీ నిరసన - పరిస్థితి ఉద్రిక్తం

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

Nellore Bus Driver Death: చనిపోతూనే 42 మందిని కాపాడిన బస్ డ్రైవర్, విషాదంలో అయ్యప్పస్వాములు

Nellore Bus Driver Death: చనిపోతూనే 42 మందిని కాపాడిన బస్ డ్రైవర్, విషాదంలో అయ్యప్పస్వాములు

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?