అన్వేషించండి

Anam Ramanarayana Reddy: నెల్లూరులో ఆనం నష్ట నివారణ చర్యలు, అసలే ఎన్నికలకు తక్కువ టైమ్ !

Nellore News: ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. వైసీపీ ఆల్రడీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది. ఇటు టీడీపీ కూడా జనసేన పొత్తుతో సీట్ల ఖరారుపై కసరత్తులు చేస్తోంది. ఈ దశలో ఆనం యాక్టివ్ కాలేకపోతే రేపు మరింత కష్టం.

YSRCP Politics: వైసీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఆల్రెడీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీలో చేరి తమ రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) మాత్రం ఎందుకో గ్యాప్ తీసుకున్నారు. ఆయన పార్టీలో చేరలేదు, అదే సమయంలో నియోజకవర్గంలోనూ తిరగడంలేదు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలు బయలుదేరాయి. ఆయన యాక్టివ్ గా లేరని, టీడీపీ (TDP) కూడా ఆయన విషయంలో సందేహంగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దశలో మళ్లీ రామనారాయణ రెడ్డి తన రాజకీయం మొదలు పెట్టారు. తన అభిమానుల్ని ఇంటికి పిలిపించుకుంటున్నారు. తాజాగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి చేజర్ల మండలానికి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. 

నాయకులెవరైనా ప్రజల్లో ఉంటేనే వారి రాజకీయాలు సజావుగా సాగినట్టు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, నిత్యం ప్రజల్లోనే ఉండాలి. వైసీపీనుంచి గెలిచినా, చివరకు టీడీపీ దరి చేరిన ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయాలు మాత్రం కొన్ని నెలలుగా సజావుగా సాగడంలేదు. నారా లోకేష్ యువగళం నెల్లూరుకు చేరుకున్న సమయంలో మాత్రమే ఆయన హడావిడి చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి లోకేష్ యువగళంలో ఆయన వెంట నడిచారు. తాను పోటీచేయాలనుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ యువగళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేశారు. ఆ తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో చురుగ్గా ఉన్నారు. టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆనంతోపాటు వైసీపీనుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. ఇద్దరూ ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారికంగా కండువా కప్పుకున్నారు. కానీ ఆనం మాత్రం ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. ఇంతకీ ఆనం మనసులో ఏముంది..? ఆయన ఎందుకు తర్జన భర్జన పడుతున్నారనేది తేలడంలేదు. 

నియోజకవర్గంపై సస్పెన్స్..
ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడినుంచి తిరిగి పోటీ చేయాలనుకోవట్లేదు. పార్టీతో విభేదాలు రాగానే లగేజ్ సర్దుకుని నెల్లూరుకు వచ్చేశారు. ఒకవేళ ఆయనకు నియోజకవర్గంపై ప్రేమ ఉంటే వెంకటగిరిలోనే ఉండేవారు. పోనీ తన పాత నియోజకవర్గం ఆత్మకూరులో పోటీ చేస్తారా అంటే.. అదీ తేలడంలేదు. ఆత్మకూరులో ఆయన చురుగ్గా పర్యటిస్తారని ఆశపడ్డ అభిమానులు కూడా సైలెంట్ అయ్యారు. ఆనం దర్శనం కావాలంటే నెల్లూరుకి వెళ్లాల్సిందే. అటు పార్టీకి దగ్గర కాలేక, ఇటు ప్రజలకు దగ్గర కాలేక ఆనం సతమతమవుతున్నారు. 

ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. వైసీపీ ఆల్రడీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది. ఇటు టీడీపీ కూడా జనసేన పొత్తుతో సీట్ల ఖరారుపై కసరత్తులు చేస్తోంది. ఈ దశలో ఆనం యాక్టివ్ కాలేకపోతే రేపు మరింత కష్టం. అయితే ఇప్పుడు ఆనం మళ్లీ తెరపైకి వస్తున్నారు. తన అభిమానులతో సమావేశమవుతున్నారు. భవిష్యత్ వ్యూహాలు రచిస్తున్నారు. పనిలో పనిగా ఆ సమావేశాల వ్యవహారం మీడియాలో హైలైట్ అయ్యేలా చూస్తున్నారు. మళ్లీ ఆనం రాజకీయంగా బిజీ అవుతున్నారు. అయితే నియోజకవర్గంమే ఫైనల్ కావాల్సి ఉంది. టీడీపీ కండువా మెడలో పడాల్సిన లాంఛనం కూడా మిగిలే ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget