అన్వేషించండి

జనసేనతో సమన్వయం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పార్టీ నేతలతో నారా లోకేశ్‌ సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఎన్టీఆర్ భవన్‌లో సీనియర్ నేతలతో సమావేశమైన లోకేశ్, జనసేనతో సమన్వయం, పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే లక్ష్యంగా సమావేశం నిర్వహిస్తున్నారు. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై నేతలతో చర్చిస్తున్నారు. 

23న లోకేశ్, పవన్ కల్యాణ్ భేటీ
జనసేనతో సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా కమిటీ నియమించింది. సభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యరో సభ్యులు, శాసనమండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నియమించారు. వీరంతా ఇరు పార్టీల సమన్వయం కోసం పని చేయనున్నారు. మరోవైపు పొత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన నిర్ణయించాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వ్యూహాలు సిద్ధం చేయనునున్నారు. 

ఫైబర్‌నెట్‌ కేసులో ఉపశమనం 

మరోవైపు ఫైబర్‌నెట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నవంబర్‌ 9 వరకు ఉపశమనం లభించింది. అప్పటి వరకు ఆయన్ను పీటీ వారంట్‌ మీద ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచడం కానీ, అరెస్ట్‌ కానీ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై శుక్రవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించింది. 17-ఎ సెక్షన్‌ అన్నది ఫైబర్‌నెట్‌ కేసుకూ వర్తిస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తొలుత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును విచారించిన తర్వాతే ఈ కేసుపై వింటామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఏపీ ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.

40రోజులకుపైగా జైల్లోనే చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 40రోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget