అన్వేషించండి

Nara Lokesh: టీచర్ల సలహాలతోనే పాఠశాలల్లో సంస్కరణలు - నారా లోకేష్ వినూత్న కార్యక్రమం

Andhra Teacher: ఆదర్శ ఉపాధ్యాయుల సూచనలతో విద్యా సంస్కరణలు చేపట్టాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. ‘షైనింగ్ టీచర్’ కల్యాణి నుంచి పలు అంశాలను తెలుసుకున్నారు.


Nara Lokesh As Student:  ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని  విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామన్నారు.   కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. 

పాఠశాల రూపు రేఖల్ని మార్చిన టీచర్ కల్యాణి
  
2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారు. తాను బాధ్యతలు చేపట్టేనాటికి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో ఇద్దరు మాత్రమే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేవారు. ఒకానొక దశలో పాఠశాలను మూసివేయాలని భావించారు. ఉపాధ్యాయురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాలలో మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేశారు. తన పనితీరుతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించారు. దీంతో 2020-21 విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 53 కి పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు చేరడం ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారిలో 23 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం పొందగా, ఒకరికి ప్రతిష్టాత్మక నవోదయ పాఠశాలలో ప్రవేశం లభించింది. ప్రస్తుతం పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు.

 విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి 

షైనింగ్ టీచర్ తో సమావేశం సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యశాఖ మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయురాలి నుంచి ఎంతో హుందాగా సలహాలు సూచనలు స్వీకరించారు. వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. పట్టుదలతో స్కూల్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. సింగిల్ టీచర్ గా ఉండి పెద్దసంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం చరిత్ర అని ప్రశంసించారు. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కల్యాణి మాట్లాడుతూ.. నా వద్ద చదువుకునే విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశాను. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య లభిస్తుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి. స్టార్ ఆప్ ది వీక్ పేరుతో ప్రతి సోమవారం హోం వర్క్, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత యూనిఫాంలో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేస్తాను. వారి ప్రోగ్రెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తాను. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేసేలా టీచర్ కు సబ్బు ప్రదానం చేసే సంస్కృతి తీసుకువచ్చాం. పేద విద్యార్థులు  చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ‘మా తొలి అడుగు’ పేరుతో వారికి అవసరమైన పలక, బలపం, పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేస్తాం. ఎవరైనా స్కూల్ కు సెలవు పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. నేను సెలవు పెట్టాలన్నా అనుమతి తీసుకుంటాను. పిల్లలు బాగా చదవకపోతే తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడతాను. ప్రతి రోజూ హోంవర్క్ ఇస్తాను. చిన్న పిల్లలకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫోటోల ప్రదర్శన ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి కలిగిస్తానని వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మరో టీచర్ ను కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

టీచర్ సూచనలు అమలు చేస్తామన్న లోకేష్

ప్రస్తుతం రాష్ట్రంలో 9,600 పాఠశాలలకు తరగతికో ఉపాధ్యాయుడు ఉన్నారు. భవిష్యత్ లో మరింత మెరుగుపరుస్తాం. విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. స్టార్ ఆఫ్ ది వీక్ ఆలోచన బాగుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటికే మెగా పీటీఎం నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నాం. నిజానికి ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఇక్కడే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. పట్టుదల ఉంటుంది. విద్యార్థులకు వర్క్ బుక్స్, రాజ్యాంగంపై చిన్నవయసులోనే అవగాహన కలిగించేలా చర్యలు తీసుకున్నాం. ముందు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు దృష్టిసారిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలియాలి. డీఎస్సీ పై 30 కేసులు వేశారు. అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. సమాజంలోనూ మార్పురావాలని, విద్య ద్వారానే ఉన్నతస్థాయికి వెళ్తామన్నారు. ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులను కలిసి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Embed widget