Nara Lokehs Tweet : దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే - జగన్‌కు లోకేష్ ట్వీట్ కౌంటర్ !
ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని ప్రభుత్వమే చెప్పిందని .. అదే దేవుడి స్క్రిప్ట్ అని జగన్‌కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
Nara Lokehs Tweet : దేవుడి స్క్రిప్ట్.. ఈ పదానికి ఏపీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏం జరిగినా దేవుడి స్క్రిప్ట్ అని వైఎస్ఆర్‌సీపీ నేతలు టీడీపీ నేతలను ఎగతాళి చేస్తూంటారు. ఇప్పుడు రివర్స్‌లో వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా జరిగే వాటిని కూడా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని.. టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈఎన్సీ నారాయణరెడ్డి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి చెప్పిన వివరాలు రివర్స్ కావడంపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. దేవుడి స్క్రిప్ట్ ఇదేనని.. జగన్‌కు నేరుగా ట్యాగ్ చేసి మరీ సెటైర్ వేశారు. ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమేనని స్పష్టం చేశారు.
గుడ్ మార్నింగ్ @ysjagan... ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమే. pic.twitter.com/JXKUEDgGsF
— Lokesh Nara (@naralokesh) October 12, 2022
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని వచ్చిన విమర్శలపై ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఉత్తరాంధ్రలో రాష్ట్ర విభజనకు ముందు రూ.1,735 కోట్లు ఖర్చుచేశారని.. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకూ రూ.1,571 కోట్లు ఖర్చుచేశారని చెప్పారు. 2019 నుంచి ఇప్పటి దాకా రూ.488 కోట్లు ఖర్చు చేశామన్నారు. తాము ప్రాధాన్యాంశాలపైనే దృష్టి సారించామని.. అందుకే నిధులు తక్కువగా ఖర్చు చేశామని చెప్పారు. దీంతో చంద్రబాబే ఉత్తరాంధ్రకు ఎక్కువ చేశారని ప్రభుత్వమే చెప్పినట్లయింది. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం రాజధాని, అభివృద్ధి అంశాలపై రాజకీయాలు నడుస్తున్న సమయంలో నారాయణరెడ్డి ప్రకటించిన వివరాలు హైలెట్ అవుతున్నాయి.
అదే సమయంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో జరిగిన అపచారంపైనా స్పందించారు. ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సంప్రదాయాలకు విరుద్ధంగా జరిపి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది జగన్‌రెడ్డి సర్కారు. సాయంత్రం 5.30 గంటలకు ముగియాల్సిన సిరిమానోత్సవాన్ని చీకటి పడ్డాక సాయంత్రం 5.30 దాటాక ఆరంభించడమేంటని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సంప్రదాయాలకు విరుద్ధంగా జరిపి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది జగన్‌రెడ్డి సర్కారు. సాయంత్రం 5.30 గంటలకు ముగియాల్సిన సిరిమానోత్సవాన్ని చీకటి పడ్డాక సాయంత్రం 5.30 దాటాక ఆరంభించడమేంటి?(1/2) pic.twitter.com/MyFrPIy1KY
— Lokesh Nara (@naralokesh) October 12, 2022