Nagababu counter to Jagan : టీ గ్లాస్‌పై జగన్ సెటైర్లకు నాగబాబు కౌంటర్ - వైరల్ అవుతున్న ట్వీట్
Tea glass : గాజు గ్లాస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. టీ గ్లాస్ మళ్లీ చేతుల్లోకి వస్తుంది కానీ ఫ్యాన్ రిపేర్ అయితే మాత్రం పనికి రాదన్నారు.
Nagababu countered Jagan comments on Tea glass : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న కొద్దీ కౌంటర్లు.. ప్రతి కౌంటర్లు హైలెట్ అవుతున్నాయి. తాజాగా సీఎం జగన్‌కు జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు కౌంటర్ ఇచ్చారు. 'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని ..కాని 'ఫ్యాన్' రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదని స్పష్టం చేశారు. అయిన సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు,పంచులు మీద పెట్టిన శ్రద్ధ లో సగం 'ప్రజాపరిపాలన' మీద పెట్టుంటే బాగుండేదని సలహా ఇచ్చారు.
'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది,
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 19, 2024
కాని
'ఫ్యాన్' రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదు...
అయిన సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు,పంచులు మీద పెట్టిన శ్రద్ధ లో సగం 'ప్రజాపరిపాలన' మీద పెట్టుంటే బాగుండేది.
I'm telling that.…
రాప్తాడు సభలో టీ గ్లాస్ సింక్‌లో ఉండాలన్న జగన్
2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతుందనర్నారు. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందారులకు మరోవైపునకు ఉంటే ఇద్దరికీ యుద్ధం జరగబోతుందన్నారు. ఈ యుద్ధం విశ్వసనీయతకు, మోసానికి మధ్య జరగబోతోందన్నారు. ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్‌కు... ఈ గడ్డమీదే పుట్టి ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇళ్లుకట్టుని, ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతుందన్నారు. అందుకే సైకిల్ ఇంటి బయట ఉండాలని.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. టీ గ్లాస్ సింక్ లో ఉండాలని చెప్పారు. దీనికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు.
దాదాపుగా రోజూ జగన్ పై నాగబాబు విమర్శలు
ఆదివారం బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని ట్వీట్ వేశారు. వైసీపీ హింసాత్మక రాజకీయాలను ఆయన ఖండించారు.
Ballot is always stronger than bullet encapsulates the idea that democratic principles, where individuals express their will through voting, possess a greater strength and enduring impact than resorting to violence or coercion. It underscores the importance of peaceful,… pic.twitter.com/RGUVJ9Ater
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 18, 2024