Naga Babu: వైసీపీ డీఎన్ఏలోనే హింస, ఆరోజు మరింతగా ఉద్రిక్తతలు జరుగుతాయి - నాగబాబు
AP Latest News: ఏపీలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై నాగబాబు స్పందించారు. వైసీపీ డీఎన్ఏలోనే హింస ఉందని ఎద్దేవా చేశారు. పోలింగ్ రోజు మరింత హింస జరుగుతుందని అన్నారు.
Janasena News: ఏపీలో ప్రజలు అందరూ చాలా తెలివితో ఓట్లు వేశారని.. అందుకే పోలింగ్ శాతం ఏకంగా 81.86 శాతం నమోదైందని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. వైసీపీ పోలింగ్ ప్రక్రియకు ఎన్నో ఆటంకాలు కలిగించిందని.. బెదిరింపులకు పాల్పడిందని అన్నారు. దాడులకు పాల్పడ్డా ఓటర్లు వెనకడుగు వేయకుండా ఓట్లు వేశారని అన్నారు. ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనే విషయం వైసీపీ వారికి అర్థం అయిపోయిందని నాగబాబు అన్నారు. అందుకే ఎన్నికలు ముగిశాక కూడా ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారని నాగబాబు బుధవారం (మే 15) సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఓటర్లపై వైసీపీ కక్షకట్టినట్లుగా ఉందని.. పోలింగ్ అనంతరం కూడా ప్రజలను వేధిస్తున్నారని నాగబాబు అన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే హింస అనేది ఉందని మరోసారి రుజువు అవుతూందని అన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడడం వైసీపీ హింసకు పరాకాష్ఠగా మారిందని అన్నారు. అదే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూటమి అభ్యర్థి అఖిలప్రియ గన్ మెన్ పై దాడికి దిగారని అన్నారు. తాడిపత్రిలో అశాంతి రేపారని.. పోలింగ్ రోజున రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్లను అపహరించి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. శ్రీ నక్కల సుబ్రహ్మణ్యం కంటికి తీవ్రగాయం అయిన విషయాన్ని నాగబాబు ప్రస్తావించారు.
ఈవీఎంలు దాచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పెంచాలి - నాగబాబు
అలాగే ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పెంచాలని అన్నారు. హింసకు పాల్పడ్డ వైసీపీ వాళ్లే ఎన్నికల సంఘాన్ని పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని అన్నారు. పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.
‘‘హింసకు పాల్పడ్డ వైసీపీ వాళ్ళే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉంది. దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది. పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలి. జూన్ 4 న వచ్చే ప్రజా తీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉంది. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనం’’ అని నాగబాబు అన్నారు.
వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl pic.twitter.com/dblFeX6DRR
— JanaSena Party (@JanaSenaParty) May 15, 2024