Raghurama hIghcourt : 3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు
ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రధానమంత్రి పర్యటనలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
Raghurama hIghcourt : ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు లైన్ క్లియర్ అయింది. తాను 3, 4 తేదీల్లో నర్సాపురంలో పర్యటిస్తానని తనకు రక్షణ కల్పించాలని ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను వస్తే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారని గతంలో ఇలాగే జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ కృష్ణరాజు లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..ఆయనకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. కొత్తగా ఏదైనా కేసులు నమోదు చేస్తే చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని ..కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
చెప్పినట్లే వ్యవసాయం - సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన రఘురామకృష్ణరాజు తర్వాత ఆ పార్టీతో విభేదించారు. రెబల్ ఎంపీగా మారారు. ప్రతీ రోజూ ప్రెస్‌మీట్లు పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆయనను వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆయనపై అనర్హతా వేటు వేయించాలని చాలా ప్రయత్నించారు కానీ.. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ మారిన లేదా విప్ ఉల్లంఘించిన వారిపైనే అనర్హతా వేటు వేస్తారు. రఘురామ ఆ రెండూ చేయకపోవడంతో స్పీక్ర కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎలుకల మద్యం తాగుతాయ్, ఉడుతల కరెంట్ వైర్లు తెంపేస్తాయ్- మాజీ మంత్రి పరిటాల సునీత
మరో వైపు రఘురామకృష్ణరాజుపై ఏపీలో అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన ఏపీలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతంలో ఒకటి రెండు సార్లు ఆయన నర్సాపురం వద్దామని అనుకున్నారు. కానీ ఆయనపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో అరెస్ట్ చేస్తారన్న కారణంతో ఆగిపోయారు. హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా.. ప్రభుత్వంపై కుట్ర చేశారని ఆరోపిస్తూ సీఐడీ సుమోటోగా కేసు పెట్టి ఆయనను పుట్టినరోజు నాడు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం సంచలనాత్మకం అయింది.
నాలుగో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు అచ్చెన్నాయుడు, చిరంజీవి కూడా పాల్గొంటారు. స్థానిక ఎంపీగా రఘురామ కూడా హాజరయ్యే అవకాశాలు కోర్టు తీర్పుతో లభించినట్లయింది.