Kesineni Nani : ఇక రాజకీయం కేశినేని చిన్నీదేనా ? క్యాడర్ అంతా మారిపోయారా ?
విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆయన సోదరుడిపైనే కేసు పెట్టడం.. ఇప్పుడీ వివాదం రాజకీయం కావడంతో ఆయన తదుపరి ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది.
Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో ఏర్పడిన వివాదం ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కేశినేని చిన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వెంటనే ఎప్పుడూ నాని వెంట ఉండే క్యాడర్ అంతా చిన్ని ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు. కేశినేని నాని కంటే... వారంతా చిన్నీతోనే నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతే కాదు చిన్నికూడ ఫుల్ డేర్ గా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న,నాగుల్ మీరా తో పాటుగా ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడ చిన్నికి ఫోన్ చేసి మరి మాట్లాడారని అంటున్నారు.
ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు - సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు !
విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామలు ఆసక్తి కరంగా మారాయి. కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న క్యాడర్ అంతా ఇప్పుడు చిన్ని కి దగ్గర కావటం,అటు కేశినేని కూడ చంద్రబాబు సహా ఇతర నాయకులు పై కూడ హాట్ కామెంట్స్ చేశారని ప్రచారం జరగుతూండటం మైనస్‌గా మారింది. రాజకీయాల్లో దూకుడుగా ఉండే కేశినేని నాని పార్టీ ఓడిపోయిన తర్వాత పలుమార్సలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. తాను రాజకీయాలకు దూరమని ఓ సారి ప్రకటించారు. అయితే తర్వాత మళ్లీ సర్దుకున్నారు.
శ్రీలంక నుంచి రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సలహలు - కేంద్రానికి బాధ్యత లేదా !?
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను తన సొంత బలంతో టీడీపీని గెలిపించుకుంటానని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రకటనలు చేశారు. ఆ ఎన్నికల్లో తన కుమార్తెనే మేయర్ అభ్యర్థిగా ప్రకటించి మరీ బరిలో నిలబడ్డారు. కానీ పరాభవం ఎదురైంది. ఆ తర్వాత కొంత సైలెంట్ గా ఉన్నారు. రాజకీయ వారసత్వాన్ని కుమార్తెకు ఇవ్వాలని అనుకుంటున్నారు. విజయవాడ తూర్పు స్థానంపై గురి పెట్టారని చెబుతున్నారు. అయితే హైకమాండ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కేశినేని చిన్నీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇక నాని రాజకీయాలు నుండి తప్పుకుంటారని ప్రచారం జోరదుకుంది..విజయవాడ తో పాటుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో తెలుగు దేశం పార్టిని కేశినేని నాని శాసించాలని భావించారని..కానీ ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగాలనే ఇంట్రస్ట్ లేదని నాని అన్నట్లుగా పార్టి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.తన సొదరుడు కేశినేని చిన్ని వ్యవహంలో నాని పోలీసులకు ఫిర్యాదు చేయటం,ఆ తరువాత పరిణామాలను పరిశీలించి కేశినేని నాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.