Konijeti Rosaiah : చిరస్థాయిగా రోశయ్య సేవలు.. స్మరించుకున్న ప్రధాని సహా ప్రముఖులు !
రోశయ్య మరణంపై ప్రధాని సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఎనలేని సేవలు చేశారని అభినందించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మరణం రాజకీయ ప్రముఖులందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్ని కష్ట నష్టాల్లోనూ కాంగ్రెస్‌నే అంటి పెట్టుకుని ఉన్న ఆయన గొప్ప సేవలు అందించాలని స్మరించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో రోశయ్యతో జరిగిన భేటీని గుర్తు చేసుకున్నారు. రోశయ్య దేశానికి.. ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
Saddened by the passing away of Shri K. Rosaiah Garu. I recall my interactions with him when we both served as Chief Ministers and later when he was Tamil Nadu Governor. His contributions to public service will be remembered. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/zTWyh3C8u1
— Narendra Modi (@narendramodi) December 4, 2021
Also Read : సీఎం పదవిలో ఉన్న రోజులే రోశయ్యకు గడ్డు కాలం ! అప్పుడేం జరిగిందంటే...?
ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులు చేపట్టిన రోశయ్య చనిపోవడం రెండు రాష్ట్రాలకు తీరని లోటని జగన్ ట్వీట్ చేశారు.
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2021
Also Read : నొప్పింపని ..తానొవ్వని నేత..! వర్గ పోరాటాల కాంగ్రెస్‌లో అజాతశత్రువు రోశయ్య !
పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య.. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
CM Sri K. Chandrashekar Rao paid homage to former Chief Minister of united Andhra Pradesh Sri Konijeti Rosaiah at his residence in Hyderabad. CM conveyed his condolences to members of the bereaved family. pic.twitter.com/YMQ5vW5BOw
— Telangana CMO (@TelanganaCMO) December 4, 2021
Also Read : వైఎస్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?
విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని, వివాదరహితుడిగా నిలిచారని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు కూడా రోశయ్య మృతికి సంతాపం తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు.(1/2) pic.twitter.com/09y6g05znW
— N Chandrababu Naidu (@ncbn) December 4, 2021
Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
సమయ స్ఫూర్తికి రోశయ్య మారుపేరని చెప్పారు. ఆయన మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగుజాతి కోల్పోయిందని పురందేశ్వరి బాధపడ్డారు.
Deeply mourn the demise of Sri Rosaiah Garu. He was a father figure to me. His political astuteness is unsurpassable.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) December 4, 2021
Andhra politics has lost a Chanakya!! pic.twitter.com/oPgp7AqMMj
Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న కొణిజేటి రోశయ్య... వృద్ధాప్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.