By: ABP Desam | Updated at : 31 Dec 2021 02:49 PM (IST)
పార్టీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు ఎక్కడా లేని కష్టాలువచ్చి పడ్డాయి. తన నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కీలక నేతలు తనపై తిరుగుబాటు చేయడంతో ఆమె ఇబ్బందుల్లో పడ్డారు. అయితే వారందరూ కోవర్టులని.. వారిపై చ ర్యలు తీసుకోవాలంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపుతంది. చిత్తూరులో ఎస్పీ బంగ్లాకు వెళ్లిన ఎమ్మెల్యే రోజా ఎస్పి సెంధిల్‌కుమార్ తన నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో కోవర్టులున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Also Read: నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !
కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారని.. వారిని ఉపేక్షించేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీతో దిగిన ఫోటోలను... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దిగిన ఫోటోలతో ఊరి నిండా ఫ్లెక్సీలు వేసుకున్నారని మండిపడ్డారు. వాటిని చూపించి అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ నుండి సస్పెండ్ అయిన వారు పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ ని కోరినట్లుగా తెలిపారు.
Also Read: నగరిలో చిరిగిపోయిన జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీలు..! రోజా పనేనని ఆరోపణలు...
రోజాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీలోని ఐదు మండలాల నేతలు ప్రత్యేకంగా గ్రూపుగా మారి.. ఇక నుంచి రోజాకు సహకరించేది లేదని చెబుతున్నారు. ఇటీవల సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను రోజాతో సంబంధం లేకుండా విడిగా నిర్వహించారు.ఈ సందర్భంగా నగరి మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా రోజా ఫోటో లేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విడిగా తన అనుచరులతో కలిసి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు..
Also Read: నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
సాధారణంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతారు. కానీ ఎమ్మెల్యే రోజా స్టైల్ మాత్రం భిన్నం. ఆమె పార్టీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేశారు. పార్టీలో కోవర్టులు రాజకీయం చేసుకుంటే ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?