Nagari Roja : నగరిలో చిరిగిపోయిన జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీలు..! రోజా పనేనని ఆరోపణలు...
నగరిలో జగన్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే దుండగులు చించేశారు. ఇది రోజా పనేనని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున నగరి నియోజకవర్గం మొత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంత మంది చింపేశారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే వీరు ఆందోళనకు దిగింది వైఎస్ఆర్‌సీపీ నేతలకు వ్యతిరేకంగానే. ఓ వర్గం వైఎస్‌ఆర్‌సీపీ నేతలే ఆ పని చేశారని.. వారు మండిపడుతున్నారు. ఎందుకంటే... నగరిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గం ఎమ్మెల్యే రోజాది కాగా.. మరో వర్గంలో ఐదుగురు అసమ్మతి నేతలు ఉన్నారు.
నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఐదుమండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు రోజాకు వ్యతిరేకం అయ్యారు. తమను రోజా పట్టించుకోవడం లేదని... కించత పరుస్తున్నారని ఆరోపిస్తూ.. రోజాకు దూరం జరిగారు. వారితో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు పడిన రోజా ఢీ అంటే ఢీ అంటున్నారు.దీంతో ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల వారంతా నగరిలోని ఓ కల్యాణమండపంలో సమావేశం అయి.. ఇక రోజాకు ఎంత మాత్రం సహకరించేది లేదని స్పష్టం చేశారు. వారంతా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్ని రోజాతో సంబంధం లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్
అనుకున్న దాని ప్రకారం ఎక్కడా రోజా ప్రభావం కనిపించకుండా తమ ఐదుగురు నేతలే..,ఐదు మండలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే చింపేశారు. ఇదంతా రోజా వర్గీయుల పనేనని... వారు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలతో కలిసి ..సొంత పార్టీపై రోజా కుట్ర చేస్తున్నారని.. సీఎం జగన్‌ను అవమానిస్తున్నారని వారు ఆరోపణలు ప్రారంభించారు.
Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?
అసమ్మతి నేతల తీరుపై రోజా ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. వారి వెనుక ఇతర ముఖ్య నేతలు ఉన్నారని.. నగరిలోపార్టీని రోడ్డున పడేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. రోజా ఎవరినీ పట్టించుకోకుండా... సొంత వర్గంతో రాజకీయాలు చేయడం.. మండలాల్లో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదేఅసంతృప్తికి కారణం అయింది.
Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి