By: Harish | Updated at : 22 Mar 2023 09:34 PM (IST)
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనుననాయి. మెత్తం ఏడు స్థానాలకు 8 మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ అసెంబ్లీ కమిటీ హాలులో జరగనున్న ఓటింగ్ తరువాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
టీడీపీ తరపున బరిలో పంచుమర్తి అనూరాధ !
వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో జయమంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బరిలోకి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ తెర మీదకు వచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారింది. మరో వైపున అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు, మంత్రులు సైతం రంగంలోకి దిగారు.
వైసీపీ ఎమ్మెల్యేలంతా విజయవాడలోనే మకాం !
మొత్తం వైసీపీ శాసన సభ్యులు విజయవాడలోనే ఉన్నారు. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో శాసన మండలి సభ్యుడి బాధ్యతను 22మంది ఎమ్మెల్యేలకు అప్పగించారు. అప్పగించిన సభ్యులతో ఓటు వేయించే బాధ్యత మంత్రులదే అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రెండు రోజుల కిందట అసెంబ్లీ వేదికగా నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహించారు. మరోసారి కూడా ఎలా ఓటు వెయ్యాలి అనే అంశంపై శాసన సభ్యులకు మంత్రులు, ఇ తర కీలక నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశాల నిర్వహిస్తున్నారు.
పంచుమర్తి అనురాధ నామినేషన్‌తో మారిన సీన్ !
తెలుగు దేశం పార్టీ ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా మూడు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అదే ఊపులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ అభ్యర్దిని నిలబెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటింగ్ పై కూడా అనుమానాలు తలెత్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పూర్తిగా ఎన్నికల పైనే దృష్టి పెట్టారు. తెలుగు దేశం మూడు స్థానాలు కైవసం చేసుకోవటంతో షాక్ తిన్న అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తరవాత జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు అలర్ట్ అయ్యింది.
పోలీసులు అలర్ట్...
పోలీసుల భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసెంబ్లి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘాను పెట్టారు. రెండు పార్టీల శాసన సభ్యులు ఎదురెదురుగా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి
ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా