By: ABP Desam | Updated at : 29 May 2023 05:12 PM (IST)
జోగి రమేష్, మంత్రి (ఫైల్ ఫోటో) Photo Credit: Facebook.com/JogiRamesh
టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం ద్వారా ఆ పార్టీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టోను విడుదల చేయడంపై విపక్ష నేతలు ఒక్కొకక్కరుగా స్పందిస్తున్నారు. చంద్రబాబు గత మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆయన చరిత్రే నకిలీ చరిత్ర అంటూ కామెంట్స్ చేశారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. మంత్రి జోగి రమేష్ సోమవారం (మే 29) మీడియాతో మాట్లాడారు. డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. మహానాడులో ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను మంత్రి చించేసి చెత్త బుట్టలో పడేశారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు 650 వాగ్దానాలు చేశారని, మొత్తం గాలికొదిలేశారని విమర్శించారు. వాటిలో కనీసం 10 హామీలు కూడా నెరవేర్చలేదని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసి చూపించారని జోగి రమేష్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఈ 14 ఏళ్ళలో ఉచిత బస్సు ప్రయాణం ఎందుకివ్వలేదని నిలదీశారు. గతంలో రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని, 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును బీసీలు తరిమి కొడతారని అన్నారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వేషాలను ప్రజలు గమనిస్తున్నారని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతే అవుతుందని అన్నారు. చంద్రబాబు ఇక హైదరాబాదో లేక సింగపూరో వెళ్ళిపోవడం ఖాయం అని ఎద్దేవా చేశారు.
మేం ఒంటరిగానే పోటీ చేస్తాం - జోగి
పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చెప్పారు. కేబినెట్‌లో ఒక్క బీసీకైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చాడా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ మాత్రం తన కేబినెట్‌లో అందరికీ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. సీఎం జగన్ మాట చెప్పాడంటే.. చేస్తారని, పేదలను సంపన్నులుగా చేయగలిగే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, పేదలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నాడని అన్నారు. ఇప్పుడు పేదల ఆదాయం రెట్టింపు చేస్తానంటున్నాడని అన్నారు. మేనిఫెస్టో అంటే బాధ్యత ఉండాలని, ఒక మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా పోరాడాలని అన్నారు.
Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
Nara Bramhani : తెలుగుదేశానికి కష్టాల్లో కలసి వచ్చే యువనేత నారా బ్రాహ్మణి - అప్పుడే క్రేజ్ ! పాదయాత్ర చేసి రాత మారుస్తారా ?
Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
/body>