By: ABP Desam | Published : 15 Oct 2021 01:38 PM (IST)|Updated : 15 Oct 2021 07:17 PM (IST)
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే
మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణాన్ని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. గురువారం సాయంత్రం నుంచి ఆర్కే మరణవార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన చేసింది. నిన్న ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆర్కే కన్నుమూసినట్లు తెలిపారు. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆర్కే చనిపోయారని స్పష్టం చేశారు. సాకేత్, మధు, శ్రీనివాస్, ఆర్కే అమరులయ్యారంటూ ప్రకటన విడుదల చేశారు.
కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీ సమస్య మొదలైంది. డయాలసిస్ ట్రీట్మెంట్ అందిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించాం. ఆర్కే మరణం పార్టీకి తీరని లోటు అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో 1958లో హరగోపాల్ జన్మించారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్. హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తండ్రితో కలసి కొంతకాలం టీచర్ గా పని చేసేవారు. 1978లో విప్లవ రాజకీయాలపట్ల ఆకర్షితులై భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్లు నాయకత్వం వహించారు. 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక.. 2001లో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా మారారు.
Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన
2004లో ఏపీ ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్యల్లో మావోయిస్టుల టీమ్ కు నాయకత్వం వహించారు. కానీ చర్చలు విఫలం కావడంతో ఆయనను నిర్భందించి హత్య చేయాలని ప్రారంభించడంతో, ఆయనను ఏఓబీ ఏరియాకు కేంద్ర కమిటీ బదిలీ చేసింది. 2014 వరకు ఏవోబీ కార్యదర్శిగా ఆ తరువాత కేంద్ర కమిటీ నుంచి గైడ్ చేసే బాధ్యతను నిర్వహిస్తున్నారు. 2018లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోగా నియమించింది. ఏఓబీలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధ కాండలో పార్టీని, కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్కే అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యాడని కేంద్ర కమిటీ వెల్లడించింది.
Also Read: పండుగ నాడు భారీగా పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా
Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!