అన్వేషించండి

Gudivada YSRCP : గుడివాడ వైసీపీ అభ్యర్థిని మారుస్తున్నారా ? తెరపైకి కొత్త పేరు ఎందుకు వచ్చింది ?

Mandali Hanumantha Rao : గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావు అనే నేత పేరు వెలుగులోకి వచ్చింది. అయితే కొడాలి నానిని కాదని జగన్ వేరే వారికి టిక్కెట్లు ఇవ్వరని వైసీపీ వర్గాలంటున్నాయి.

Gudivada YSRCP :  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి  వైసీపీ లో ఎదురు లేదు. సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారుచేయలేదు. అలాగని వేరే అభ్యర్థి పేరు బయటకు రాలేదు.  కానీ ఇప్పుడు కొత్తగా వేరే అభ్యర్థి పేరు వినపిస్తోంది. మండలి హనుమంతరావు అనే  నేతకు గుడివాడ టిక్కెట్ ఇవ్వబోతన్నారన్న ప్రచారం జరుగుతోంది.   గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలాడుకుంటున్నారు. 

మండలి హనుమంతరావు పేరు తెరపైకి !                                    

హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది.  పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.  గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు.

మరో దీటైన నేత ఎదగకుండా జాగ్రత్త పడిన కొడాలి నాని 

వ్యతిరేకత ఉన్న అభ్యర్థుల్ని  పూర్తి స్థాయిలో మారుస్తానని తనకు ఎంత దగ్గర  అయినప్పటికీ .. పార్టీని ఓడగొట్టుకోలేనని గడప గడపకూ కార్యక్రమం సమీక్షల సందర్భంగా సీఎం జగన్ చాలా సార్లు చెప్పారు. కొడాలి నాని.. గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదని పార్టీ మీటింగ్‌లో చాలా సార్లు ై ప్యాక్ ప్రతిిధులు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే కొడాలి నాని మాత్రం.. తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆయనకు ధీటైన నేత గుడివాడ వైసీపీలో లేరు.  కొడాలి నాని వైసీపీలో చేరిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు.                                         

జగన్ టిక్కెట్ నిరాకరిస్తే కొడాలి నాని ఏం చేస్తారు ?

ఇప్పుడు సీఎం జగన్ నిజంగా అభ్యర్థిని మార్చే పరిస్థితి  లేదని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి. అయితే గుడివాడలో సర్వే రిపోర్టులు చూసి .. కాపు సామాజికవర్గ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జగన్ చేయవచ్చని చెబుతున్నారు. మరో కీలక నియోజకవర్గానికి కొడాలి నానిని పంవవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మండలి హనుంతరావు గుడివాడ వైసీపీలో కలకలం రేపుతున్నారు.                             

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
AI Generated Videos : AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
Vijay Deverakonda Rashmika: రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
Ikkis Movie Collection: ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
Embed widget