News
News
X

Nara Lokesh : దుబాయ్‌లో సీఎం జగన్‌ కంటే గౌతంరెడ్డే పాపులరా ? హాట్ టాపిక్‌గా లోకేష్ ట్వీట్

సీఎం జగన్ గురించి అక్కడ ఎవరికీ తెలియదని దుబాయ్ ఎక్స్‌పోలో ప్రసంగించిన గౌతంరెడ్డి చెప్పడంపై లోకేష్ సెటైర్లు వేశారు.

FOLLOW US: 

ఏపీ పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి ( Mekapati Gowtam Reddy ) దుబాయ్ ఎక్స్‌పోలో ( Dubai Expo ) ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసుకుని అందర్నీ ఆహ్వానిస్తూ ఏపీ ప్లస్ పాయింట్స్‌ను ప్రజెంట్ చేస్తున్నారు . ఇలా ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌లో ఏపీ సీఎం జగన్ ( CM Jagan ) గురించి పెద్దగా ఎవరికీ తెలియదని ప్రసంగించారు. గౌతం రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) ఈ అంశంపై ట్వీట్ చేశారు.  గౌతం రెడ్డి ప్రసంగిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఆ సమావేశం జరిగిన హాల్లో చాలా వరకూ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని చెబుతూ.. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు. 

కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు.. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు అంటూ లోకేష్ హితవు పలికారు.  దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీకి ( AP ) పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించారమని ఏపీ బృందం ప్రకటించింది. మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నట్లు మీడియాకు తెలిపారు.  ఇంకా పలు కంపనీలు ఏపీలో పెట్టబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. 

Published at : 16 Feb 2022 07:38 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Nara Lokesh Dubai Expo Mekapati Gautam Reddy Investments in AP

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్, 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్, 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

Prabhas: ప్రభాస్‌కు రోజా గుడ్ న్యూస్, కృష్ణంరాజు కోసం ప్రత్యేక కానుక

Prabhas: ప్రభాస్‌కు రోజా గుడ్ న్యూస్, కృష్ణంరాజు కోసం ప్రత్యేక కానుక

Railway Zone Politics : రైల్వేజోన్‌తో రాజకీయం ఆటలు - ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ తీరేదెన్నడు ?

Railway Zone Politics :  రైల్వేజోన్‌తో రాజకీయం ఆటలు - ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ తీరేదెన్నడు ?

టాప్ స్టోరీస్

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే