News
News
X

KVP Letter To Jagan : పోలవరంపై రాజీ పడితే రాష్ట్ర ద్రోహం చేసినట్లే - సీఎం జగన్‌కు మాజీ ఎంపీ కేవీపీ లేఖ !

పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ద్రోహం చేసినట్లేనని సీఎం జగన్‌కు కేవీపీ లేఖ రాశారు. కే్ంద్రం ఒత్తిడికి తలొగ్గవద్దని ఆయన కోరారు.

FOLLOW US: 
Share:

KVP Letter To Jagan  :  పోలవరం విషయంలో ఎత్తు తగ్గించాలని కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తొలగ్గితే రాష్ట్ర ద్రోహానికి పాల్పడినట్లేనని సీఎం జగన్ కు ... మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. నిధులు లేవి కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని కేవీపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందన్నరు. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని.. ఎత్తు తగ్గి్తే.. ఏపీ చాలా నష్టపోతుందన్నారు. పోలవరం ఎత్తుు తగ్గకుండా నిర్మాణం చేపట్టాలని .. ఒక వేల పోలవరం ఎత్తు తగ్గిస్తే ద్రోహం చేసినట్లేనని కేవీపీ పేర్కొన్నారు.   

పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల కంటే తక్కువగా ఉంటే పోలవరం ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యం అని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పిందని గుర్తు చేశారు. భూసేకరణకు, పునరావాస- పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నిధులు వెచ్చించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు మరియు 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు 30 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.ఈ ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు కుదించవలసిందిగా రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. 

బచావత్ ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు పోలవరాన్ని పోలవరం రిజర్వాయర్‌ను 150 అడుగుల ఎత్తుకు కట్టకపోతే ఈ పోలవరం నిర్మాణం కేవలం ఒక కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుందన్నారు. ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్ గా నీళ్లు నిలువ చేయలేదని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై ఖర్చుపెట్టిన 20వేల కోట్ల ప్రజాధనం కూడా వృధా అవుతుందని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం చూపిస్తున సవితి తల్లి ప్రేమ వల్ల, నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రంలోకి వృధాగా పోయే 300పైగా టి‌ఎం‌సిల నీటిని వినియోగంలోకి తెచ్చే ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు ను అత్యంత ప్రజా ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రమే నిర్మించి, 2018 నాటికి పూర్తి చేయాలని విభజన చట్టం చెప్పిందనికేవీపీ గుర్తు చేశారు.
 
పోలవరం అంశంపై  సోమవారం ప్రధాని మోదీకి  లేఖ రాశారు.  పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని 150 మీటర్ల కాంటూరు కాకుండా 140 మీటర్లకే పరిమితం చేయాలంటూ రాష్ట్ర ప్రభ్వుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు?’’ అని   కేవీపీ రామచంద్రరావు లేఖలో ప్రధానిని నిలదీశారు.  ‘‘కాంటూరును 140 మీటర్లకే పరిమితం చేస్తే రూ.30,000 కోట్ల మేర సహాయ పునరావాస వ్యయం తగ్గుతుంది. ఆ సాకుతో భారీ ప్రాజెక్టును రిజర్వాయరు స్థాయికి కుదించేస్తారా? కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి ఎందుకు అప్పగించారు? 2018 నాటికే పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుపట్ల ఎందుకు నిర్లక్ష్యం చూపారు? డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి గల సాంకేతిక కారణాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదు? జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టులో 150 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేయాలి’’ అని లేఖలో కేవీపీ డిమాండ్‌ చేశారు. ప్రధాని లేఖ రాసిన ఒక్క రోజులోనే సీఎం జగన్‌కు కేవీపీ లేఖ రాశారు. 

Published at : 14 Mar 2023 05:58 PM (IST) Tags: KVP Polavaram KVP letter to Jagan KVP letter to Modi

సంబంధిత కథనాలు

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?