News
News
వీడియోలు ఆటలు
X

27 వరకు గడువు ఇవ్వండి- సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ

తన అమ్మ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు అవినాష్ రెడ్డి. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపమలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్నందున 27వ తేదీ వరకు విచారణకు గడువు ఇవ్వాలని కోరారు. 

తన అమ్మ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు అవినాష్ రెడ్డి. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు బ్లడ్‌ ప్రెషర్‌తోపాటు హైపర్‌ టెన్షన్‌ ఇబ్బందులు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. తన నాన్ని భాస్కరరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా ఇదే కేసులో  జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. తల్లిదండ్రుల బాగోగుల చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ పరిస్థితిలో అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని వివరించారు. 

వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ తన తల్లి కోలుకోవడం లేదని ఇప్పటికే ఓసారి గుండెపోటు కూడా వచ్చిందన్నారు అవినాష్. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని లేఖలో వివరించారు. యాంజియోగ్రామ్‌ టెస్టు చేస్తే గుండెలో రెండు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. ఆమెను మరికొన్ని రోజులు ఐసీయూలో చికిత్స అందిస్తారని వివరించారు. 

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు అవినాష్ రెడ్డి. ఈ పరిస్థితుల దృష్ట్యా తనకు గడువు ఇవ్వాలని సీబీఐకి రిక్వస్ట్ పెట్టుకున్నారు. 

తాను 27 వ తేదీ వరకు గడువు కోవాలని కోరారు. పరిస్థితి 27 నుంచి తాను విచారణకు అందుబాటులోకి వస్తానని పేర్కొన్నారు. తన లేఖతోపాటు తల్లి ఆరోగ్యంపై వైద్యుల ఇచ్చిన రిపోర్టులను కూడా జతపరిచారు. ఉదయం కూడా ఆయన ఓ లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఏడు రోజుల గడువు కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని జత చేస్తూ మరో లేఖ రాశారు. 

ఉదయం లక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఉదయం వైద్యులు ఓ బులెటిన్ విడుదల చేశారు. ఆమెకు బీపీ తక్కువ ఉందని తెలిపారు. ఏం తినలేకపోతున్నారని... వాంతులు అవుతున్నాయని పేర్కొన్నారు. మెదడుకు, పొట్టకు ఆల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉందని వివరించారు. ఇంకొన్ని రోజులు చికిత్స చేయాల్సి ఉందని బులెటిన్‌లో తెలిపారు. 

కర్నూలులో ఉదయం నుంచి హైడ్రామా 

కర్నూలులో ఉదయం నుంచే హైడ్రామా నడుస్తోంది. ఉదయాన్నే కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దానికి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ ఎదుట బైఠాయించారు అవినాష్ రెడ్డి అనుచరులు. హాస్పిటల్ ముందే పెద్ద ఎత్తున బైఠాయించి బయటవారు రాకుండా అడ్డుకుంటున్నారు. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి దగ్గరకు చేరుకొని అరెస్టు చేస్తారా లేక అవినాష్ రెడ్డిని ఎస్పీ ఆఫీసుకు పిలిపించి విచారణ చేపడతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Also Read:26న అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, మంచి జరిగి ఉంటే మద్దతివ్వండి: జగన్

Also Read:  వైసీపీ ఎమ్మెల్యేలను పొగడటంపై కేశినేని నాని సీరియస్ కామెంట్స్

Published at : 22 May 2023 01:42 PM (IST) Tags: CBI Kurnool Viveka Murder Case Avinash Reddy

సంబంధిత కథనాలు

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్