Uggani Recipe: స్ప్రింగ్ బిర్యాని ఎప్పుడైనా రుచి చూశారా.. అక్కడకు వెళ్తే కచ్చితంగా ఉగ్గాని తినాల్సిందే
Uggani Recipe: సీమ సందులలో ఎక్కడైనా దొరికే అల్పాహారం ఉగ్గాని. దీని కాంబినేషన్ మిరపకాయ బజ్జీలు లేదా ఉల్లి వడలు. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఉగ్జానిని ఇంట్లో చేసుకుని తింటారు.
స్ప్రింగ్ బిర్యాని... ఇదేదో ఇంగ్లీష్ వంటకం అనుకునేరు. ఇది అచ్చమైన రాయలసీమ వంటకమే ఈ ఉగ్గాని. దీనినే ముద్దుగా స్ప్రింగ్ బిర్యాని అని నిక్ నేమ్ పెట్టుకున్నారు సీమ వాసులు. తెలంగాణలోనూ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉగ్గానీ చేసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. సీమ సందులలో ఎక్కడైనా దొరికే అల్పాహారం ఉగ్గాని. దీని కాంబినేషన్ మిరపకాయ బజ్జీలు లేదా ఉల్లి వడలు. బొరుగులతో తయారు చేసే ఈ ఉగ్గానిని పప్పులు, కారం కలిపి దంచుకునే పొడితోనూ, వేరుశనగ విత్తనాల చట్నీతోనూ కలిపి లాగించడం ఈ ప్రాంత వాసులకు మహా సరదా అండోయ్..
అనంతపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రామచంద్ర నగర్ రైల్వే గేటు పక్కనే ఉన్న ఓ చిన్నపాటి పూరిగుడిసెలో ఉగ్గాని, వడలు హాట్ హాట్ గా దొరుకుతాయి. ఇక్కడే ఎందుకు అంటే అ టేస్ట్ అలా ఉంటుంది మరి. తెల్లవారుజామున ఐదు గంటల కు ప్రారంభమయ్యే ఈ హోటల్ ఉదయం 9 గంటలకే మూసేస్తారు. ఈ సమయంలో విపరీతమైన రద్దీ అక్కడ మనం చూడొచ్చు. కారణం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్దాల నుంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. సాధారణంగా హోటల్లో తిన్నాక బిల్లు ఎంత చెల్లించాలి అనేది హోటల్ వాళ్లే చెప్పడం పరిపాటి.
ఇక్కడ తిన్న వారే నిజాయితీగా బిల్లు కడుతుండటం కొసమెరుపు. అంత రుచికరమైన ఉగ్గాని వడలు తిన్నాక బిల్లు ఎలా ఎగ్గొడతారు లేండి అంటారు హోటల్ నిర్వాహకురాలు పద్మావతి. అనంతపురం పట్టణంలో రుచికరమైన ఉగ్గాని ఎక్కడ దొరుకుతుంది అంటే ఠపీమని చెప్పే అడ్రస్ రామచంద్ర నగర్ రైల్వే గేటు పక్కన అని. అక్కడ ఉగ్గాని అంత ఫేమస్ మరి. రాయలసీమతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉగ్గానీని ఎంతో ఇష్టంగా ఉంటారు.
ఇక స్ప్రింగ్ బిర్యానీ రెసిపీ విషయానికి వస్తే బొరుగులను నీటిలో తడిపి పక్కన ఉంచుకుంటారు. కడాయిలో నూనె పోసి వేడయ్యాక జిలకర ,ఆవాలు టమోటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు , చిటికెడు పసుపు ఉప్పు వేసి బాగా ఉడికిస్తారు. అనంతరం తడిపిన బొరుగులు ఈ మిశ్రమంలో కలిపి పైన పప్పుల పొడి, కొత్తిమీర జల్లిస్తారు. కొంచెం నిమ్మకాయ రసం కలిపితే సరి. నోరూరించే ఉగ్గాని రెడీ.
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: AP Omicron Cases: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్