![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhuma Akhila Priya భూమా అఖిల ప్రియ అరెస్టుకు పోలీసుల యత్నం, ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత
![Bhuma Akhila Priya భూమా అఖిల ప్రియ అరెస్టుకు పోలీసుల యత్నం, ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత Tension in Allagadda after Police attempt to arrest Bhuma Akhila Priya Bhuma Akhila Priya భూమా అఖిల ప్రియ అరెస్టుకు పోలీసుల యత్నం, ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/27/b4483d3b42a85bcb3efff8c287deeacc1703676526181233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Allagadda News: ఆళ్లగడ్డ: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. అఖిల ప్రియను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, టీడీపీ శ్రేణులు అడ్డుకోవాలని చూశాయి. దాంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న అఖిలప్రియను పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, శాంతి భద్రతల దృష్ట్యా టీడీపీ ప్రోగ్రాం వాయిదా వేసుకోవాలని అఖిలప్రియకు పోలీసులు సూచించారు. అయితే చివరి నిమిషంలో చెబితే ఎలా అని పోలీసులతో మాజీ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)