పరిటాల ధైర్యాన్ని మీ నాన్న చెంపనడుగు- రాప్తాడు ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ కౌంటర్
రాప్తాడులో తోపుదుర్తి వర్సెస్ పరిటాల మధ్య జరుగుతున్న ఫైట్ తీవ్రమవుతోంది. ఇరు వర్గాల మధ్య ఫ్యాక్షన్ సినిమాకు మించిన డైలాగ్‌లు పేలుతున్నాయి.
![పరిటాల ధైర్యాన్ని మీ నాన్న చెంపనడుగు- రాప్తాడు ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ కౌంటర్ Paritala Sriram Serious Reacts On MLA Thopudurthi Prakash Reddy comments పరిటాల ధైర్యాన్ని మీ నాన్న చెంపనడుగు- రాప్తాడు ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/031d789535df2d263c7e74fe9b8665331663669122394215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అనంతపురం జిల్లాలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో మాటల పేలుళ్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబానిది రక్త చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇస్తూ పరిటాల శ్రీరామ్ తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. హైదరాబాద్‌లో కారుబాంబు పేలుళ్లలో రక్తపు మరకలు మీవేననిపైగా మాది రక్త చరిత్ర అనడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల కుటుంబానికి ధైర్యం లేదని వ్యాఖ్యానించడానికి పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. అనంతపూర్‌లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గోడల్ని అడిగినా తమ ధైర్యం గురించి చెబుతాయన్నారు. మా ధైర్యం గురించి మా నాన్న ఎడమకాలి చెప్పునడుగు లేదా మీ నాన్న చంపనడుగు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలకు సంబంధించి శ్రీరామ్ కౌంటర్ ఇస్తూ ఈ వీడియోను రూపొందించి రిలీజ్ చేశారు.
ఇలా పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడంతో సామాన్య ప్రజలలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న ఆందోళన రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఇరుపార్టీల కార్యకర్తలలో నెలకొని ఉంది. ఇలా దూషణ పర్వాలతో పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)