Kurnool Parliament Constituency : కర్నూలు పార్లమెంటులో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా... లేక టీడీపీ పట్టు సాధిస్తుందా?
Kurnool Parliament Constituency: ఆ పార్లమెంటు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అలాంటి నియోజకవర్గంలో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు ఎత్తులకు పైఎత్తుల వేస్తున్నాయి.
Andhra Pradesh News: రాయలసీమ ముఖద్వారం కర్నూలు. లోక్ సభ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి(Kotla Vijayabhaskar Reddy) ఆయన తనయుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి(Kotla Jayasurya Prakash Reddy) కేంద్ర పదవులు చేపట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అలాగే అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య(Damodaram Sanjeevayya) కూడా ఇక్కడి వారే. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పునర్విభజన జరగక ముందు 6 అసెంబ్లీలో స్థానాల్లో ఉండేది. పునర్విభజన తర్వాత కొత్తగా మంత్రాలయం నియోజకవర్గం (Mantralayam Assembly constituency)రావడంతో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. వాటిలో ఒకటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ మిగిలిన ఆరు నియోజకవర్గాలు జనరల్ స్థానాలు.
1952 నుంచి ఎన్నికలు
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి కర్నూలు అసెంబ్లీతోపాటు కోడుమూరు(Kodumuru), పత్తికొండ, ఎమ్మిగనూర్(Emmiganoor), ఆలూరు(Alur), ఆదోని(Adoni), మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. 1952లో మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి పార్లమెంటు సభ్యుడు సీతారామిరెడ్డి. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1952 నుంచి మొత్తం 18 లోక్‌సభ ఎన్నికలు జరుగ్గా 12 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టిడిపి, 2 సార్లు వైస్సార్సీపీ, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఇలా గెలిచిన వారిలో సమీప ప్రత్యర్డైన సోమప్పపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 1,99,356 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అభ్యర్థిగా ఎన్నికై మొదటిసారే కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 10వ సారి 1991 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఎస్వీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో లోక్ సభకు రాజీనామా చేశారు. 15వసారి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కే కృష్ణమూర్తిపై కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల జయసూప్రకాశ్ రెడ్డి గెలుపొంది 15వ లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో మరోసారి గెలిచిన సూర్య ప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ శాఖ మంత్రి పదవి చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన రెండు దఫా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఓటర్లలో చైతన్యం ఎక్కువ, పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోను పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది. 2009లో 62.48 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 71.21 శాతానికి చేరి 2019లో 79.65% పోలింగ్ జరిగింది. దీనిని బట్టి ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో కూడా కొత్త ఓటర్లు నమోదు అవడం.. ఆ కొత్త ఓటర్లు అంతే చురుకుగా ఓటింగ్‌లో పాల్గొనడం జరుగుతోంది.
త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ముందు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైసీపీ ప్రకటించింది. ఆయన పోటీ నుంచి తప్పుకని టీడీపీలో చేరడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్య వైసీపీ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మాత్రం తన అభ్యర్థి ప్రకటన విషయంలో అచి తూచి అడుగులు వేస్తోంది. ముందుగా అందరూ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం ఎంపీగా బరిలోకి దింపుతుందని అందరూ భావించినా, ఎవరు ఊహించని విధంగా ఆయనను డోన్ నుంచి పోటీకి దింపుతున్నారు. టిడిపి,జనసేన,బిజెపి కూటమి అభ్యర్థిగా ఎవరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ టికెట్ ఆశిస్తున్న వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయనకు సీటు ఖాయమనే టాక్ నడుస్తోంది.