అన్వేషించండి

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్య నాయుడు.. తుంగభద్ర పరిస్థితేనని కామెంట్స్

Andhra Pradesh News | భారీ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల నిపుణుడు, సాంకేతిక సలహాదారుడు కన్నయ్య నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

భారీ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల నిపుణుడు, రిటైర్డ్‌ ఇంజినీర్‌, సాంకేతిక సలహాదారుడు కన్నయ్య నాయుడు ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ఆనకట్ట రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా తనిణీ చేశారు. పదో నంబర్‌ గేట్ వద్ద లీకేజీ అవుతుండడంతో పరిశీలించారు. గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగా ఉందని, దాని వల్ల ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. 

ఐదేళ్లలోపు క్రస్ట్‌ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలి
కానీ మరో ఐదేళ్ల లోపు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.  కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్‌ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదన్నారు.

ఏపీలో అక్కడ వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలు తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య ఆరేబియా సముద్రం నుంచి బెంగాల్ ఉత్తర భాగాలతో పాటు పలు రాష్ట్రాల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. సముద్రమట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి.. ఆపై ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది.  

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఏపీలో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం మరో ఏడు రోజులపాటు కూడా ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు పడే అవకాశం ఉంది. 

పెరుగుతున్న కృష్ణా నదిలో వరద ప్రవాహం 
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఈ పరిణామం జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి దాదాపు 1,35,00 క్యూసెక్కుల వరద చేరుకుంటోంది.

నిండుతున్న శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ఆదివారం మధ్యాహ్నం నాటికి అది 878.40 అడుగులకు చేరుకుంది. శనివారంతో పోలిస్తే (873.90 అడుగులు) ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు ఐదు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే, మరో 24 గంటల్లో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరింది.  ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో 67,399 క్యూసెక్కులుగా నమోదైంది. 

అధికారుల హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున, కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నదిలోకి వెళ్లడం లేదా నది పరిసర ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదని సూచిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉండటంతో నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Jagan letter to Chandrababu: కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
KTR Vs Revanth Reddy:
"నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు" కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు 
Rajamouli : రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... జక్కన్నకు RGV సపోర్ట్
రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... జక్కన్నకు RGV సపోర్ట్
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌
IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్‌పై దాడి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Jagan letter to Chandrababu: కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
KTR Vs Revanth Reddy:
"నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు" కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు 
Rajamouli : రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... జక్కన్నకు RGV సపోర్ట్
రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... జక్కన్నకు RGV సపోర్ట్
Deekshith Shetty : రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
Paanch Minar Review - 'పాంచ్ మినార్' రివ్యూ: సాఫ్ట్‌వేర్ ట్రయల్స్ నుంచి క్యాబ్ డ్రైవర్‌గా... రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'పాంచ్ మినార్' రివ్యూ: సాఫ్ట్‌వేర్ ట్రయల్స్ నుంచి క్యాబ్ డ్రైవర్‌గా... రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
IBOMMA:ఐ బొమ్మలాంటి పైరసీ వెబ్‌సైట్‌లతో పిల్లల భవిష్యత్‌ను నాశనం! తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!
ఐ బొమ్మలాంటి పైరసీ వెబ్‌సైట్‌లతో పిల్లల భవిష్యత్‌ను నాశనం! తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!
12A Railway Colony Review - '12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?
'12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?
Embed widget