Special Tiffin: దోశ విత్ ఖీమా.. పూరీ విత్ ఖీమా.. ఈ కాంబినేషన్‌లో టిఫిన్ టేస్టే వేరప్పా..
అనంతపురంలో బ్రేక్ పాస్ట్‌గా ఖీమా విత్ దోశ.. ఖీమా విత్ పూరీ ఎంత ఫేమస్సో తెలుసా
రుచులలో ఆనంతకు ప్రత్యేక స్థానం ఉంది. అనంతపురం పట్టణంలో ఏ సందుకు వెళ్ళినా ఏదో ఒక స్పెషల్ వంటకం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యాపారులు కూడా వెరైటీగా థింక్ చేస్తారు. మార్కెట్లో సంథింగ్ స్పెషల్‌గా నిలబడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వినియోగదారుల టేస్టుకు తగ్గట్టుగా తమ వంటల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే దోశ విత్ ఖీమా అలాంటిదే.
అనంతపురం పట్టణంలోని కోర్టు రోడ్‌లో నాగరాజు హోటల్ తెలియనివాళ్ళు ఉండరు. కారణం ఆ హోటల్లో దొరికే ఆహార పదార్థాలు అలా ఉంటాయి మరి. సాధారణంగా దోశలోకి చెట్ని, ఆలు కర్రీ లాంటివి చాలా సాధారణ హోటల్స్ వాళ్లు చేస్తుంటారు. ప్రాంతాలను బట్టి ఈ మెనూలో మార్పులు ఉంటాయి. దశాబ్ద కాలం నుంచి చికెన్ గ్రేవిని దోశలోకి వడ్డించడం అక్కడ అక్కడ తారసపడుతూ ఉంది. మటన్ ఖీమా దోశ ప్రత్యేకంగా కోర్టు రోడ్డులోని నాగరాజు హోటల్‌లో లభిస్తోంది. నాలుగు దశాబ్దాల నుంచి దోస విత్ ఖీమా కర్రీ ఇక్కడ మెనూలో ప్రథమ స్థానంలో ఉంది. తమ పూర్వీకులు నుంచి వారసత్వంగా ఇదే ఖీమా కర్రీలను దోశలోకి ఇస్తున్నట్లు హోటల్ నిర్వాహకుడు నాగరాజు చెబుతాడు. అసలే రుచి కోసం ఎంత దూరమైనా వెళ్లే మనవాళ్ళు నాగరాజు హోటల్‌కు క్యూ కట్టడం నిత్యం కోర్టు రోడ్డులో చూడొచ్చు. దోశ ఒక్కటే కాదు పూరీ విత్ ఖీమా కర్రీకి కూడా అంతే డిమాండ్టుం ఉంటుంది. ఇక్కడ దోశ, పూరీ అన్నది కాదు ఫేమస్ మాత్రం ఖీమానే. అందుకే కోర్టు రోడ్‌లో ఉన్న నాగరాజు ఖీమా సెంటర్‌కు అంత డిమాండ్. ఎక్కువగా బ్రేక్ పాస్ట్‌గా ఖీమా విత్ పూరీ.. ఖీమా విత్ దోశను తినడానకిి ఇష్టపడుతారు. ఉదయం సాయంత్రం ఈ ప్రత్యేక వంటకం అందుబాటులో ఉంటుంది.
Also Read: సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్
Also Read: CPS Cancellation: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి